ఈమధ్య కాలంలో సినిమాల్లో తక్కువగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ట్విట్ల వ్యవహారాల్లో ఎక్కువగా కనిపించిన భామ పూనమ్ కౌర్. ఒకసారి ఆవేదనతో.. ఇంకోసారి అర్ధంకాని ఫీలింగ్ తో ట్వీట్లు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఇష్యూ తరవాత ఇన్నాళ్లకు ఈ అమ్మడు ఓ సినిమాలో కనిపించనుంది. కాకుంటే ఇన్నాళ్లగా బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ లో కాదు.. ఏకంగా బాలీవుడ్ మూవీలో మెరవనుంది.
అంకూష్ భట్ డైరెక్ట్ చేస్తున్న హిస్టారికల్ మూవీ 3 దేవ్ లో రాధ క్యారెక్టర్ లో పూనమ్ కౌర్ నటిస్తోంది. ఆమె రోల్ కు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. రాజస్థాన్ లోని మౌంట్ అబూలో ఉన్న బ్రహ్మకుమారీ ఆశ్రమంపై పూనమ్ పై ఫస్ట్ షాట్ తీశారు. చాలా రోజుల తరవాత కెమెరా ముందు నటించే అవకాశం రావడంతో పూనమ్ ఉబ్బితబ్బిబ్బవుతోంది. ‘‘చారిత్రక చిత్రంలో నటించాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నా. ఇన్నాళ్లకు నా కోరిక తీరబోతోంది. ఈ క్యారెక్టర్ కోసం నన్ను ఆడిషన్ కూడా చేయలేదు. మూడేళ్ల క్రితమే ఫిలిం మేకర్స్ ఈ రోల్ కోసం నన్నడిగారు. దేవుడు నా ప్రార్ధనలు ఆలకించాడు. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అంటోంది పూనమ్.
3దేవ్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు భర్త కరణ్ సింగ్ గ్రోవర్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది పూనమ్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. రకరకాల కారణాలతో ఆగుతూ.. సాగుతూ అన్నట్టుగా సాగి చివరకు రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇందులో కరణ్ తోపాటు రవి దూబే.. కునాల్ రాయ్ కపూర్ కూడా హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో వీళ్లు ముగ్గురూ మోడరన్ బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులుగా కనిపింబోతున్నారు.