ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, కొన్ని టీవీ ఛానల్స్ లో బాగా పాపులర్ అవుతూ అందరి నోళ్ళలో నానుతున్న ఫిలిం క్రిటిక్ ఇప్పటి దాకా పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు మాత్రమే టార్గెట్ గా ఉన్నాడు. ఇప్పుడు మెల్లగా ఇండస్ట్రీలో సైతం ఇతని తీరుపట్ల నిరసన, వ్యంగ్యం వ్యక్తం చేసే సంఖ్య పెరుగుతోంది. నిన్న ప్రముఖ రచయిత కోన వెంకట్ ట్వీట్ చేస్తూ అతన్ని జోకర్ అన్న సంగతి తెలిసిందే. కాని పేరు ప్రస్తావించలేదు. సదరు క్రిటిక్ సైతం కోన పేరు చెప్పకుండా అంతకంత బదులు కూడా ఇచ్చేసాడు. తాజాగా ఈ లిస్టు లో హీరొయిన్ పూనం కౌర్ కూడా జాయిన్ అయ్యింది. ఈ మధ్య చెప్పుకోదగ్గ అవకాశాలు లేక క్యారెక్టర్ రోల్స్ వైపు మళ్ళుతున్న పూనం తన ట్విట్టర్ లో సదరు క్రిటిక్ పేరు చెప్పకుండా తిట్ల దండకం అందుకోవడం విశేషం. పూనం పవన్ వీరాభిమాని.
ఇలా ఒకరిని విమర్శిస్తూ డబ్బులు సంపాదించే వాళ్ళ కన్నా తనకు బిచ్చగాళ్ళే నయం అనిపిస్తారని పేర్కొన్న పూనం అతనికి ఫ్యాట్సో అని నామకరణం చేసింది. అంటే లావుగా ఉండే వాళ్ళు అని అర్థం. రోజు టీవీలో చూడలేక విసుగొస్తోంది అని చెప్పిన పూనం అతని నిరుద్యోగ సమస్యను ఆర్థం చేసుకుని ఏదైనా ఉపాధి చూపిస్తే మంచిదని పంచ్ వేసింది. అతని బరువు తగ్గడానికి అందరు చందాలు వేసుకుంటే మంచిదన్న పూనం ఏకంగా ఇతని గురించి పట్టించుకోమని సిఎంకే రిక్వెస్ట్ పెట్టేసింది. ఇలా అనడం తనకు ఇష్టం లేదంటూనే ఆతని ఉద్దేశం అర్థం కావడం వల్లే ఇలా స్పందించాల్సి వచ్చిందని పవన్ మీద తన అభిమానాన్ని ఈ రూపంలో చాటుకుంది. ఇప్పటికే పవన్ ఫాన్స్ చేస్తున్న అల్లరితో జరుగుతున్న రచ్చ చాలక ఇప్పుడు ఒక్కొక్కరు సినిమా వాళ్ళు కూడా వస్తుండటం తనకే ప్లస్ అవుతుందని ఆ క్రిటిక్ భావించడంలో ఆశ్చర్యం ఏముంది.