పవన్ కల్యాణ్, కత్తి మహేశ్ గొడవ తెలిసిందే. అయితే.. ఈ వివాదంలోకి పూనమ్ కౌర్‌ను కూడా లాగడం, ఆమె కూడా మాటలు, ట్వీటులతో కత్తితో గొడవను కొనసాగించడం తెలిసిందే. పవన్‌కు మద్దతుగా కత్తి మహేష్‌పై పూనమ్ పదునైన వ్యాఖ్యలు చేయడంతో ఆమె కూడా ఇందులో కేంద్ర బిందువైంది.. దాంతో కత్తి ఆమెపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు పూనమ్ వెళ్లగా, అక్కడ కత్తి కూడా కనిపించారట.. కత్తిని చూడగానే పూనమ్ నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయారట.
హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సొసైటీలో శనివారం ఓ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి మహేష్ కత్తి, పూనమ్ కౌర్ తదితరులను ఆహ్వానించారు. కార్యక్రమానికి ఆరంభానికి ముందే మహేష్ కత్తి అక్కడి వచ్చి వేదికపైకి వెళ్లారు. ఈవెంట్ ప్రారంభమైన కొద్ది సేపటికి పూనమ్ కౌర్ వచ్చారు. పూనమ్ కౌర్ వేదిక వద్దకు వెళ్లేసరికి ముందు మహేష్ కత్తి కనిపించాడు. దాంతో అక్కడ ఉన్నవారిని పలకరించకుండా వెంటనే పూనమ్ కౌర్ తిరుగుముఖం పట్టింది అని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది . ఈవెంట్‌లో పాల్గొనకుండానే పూనమ్ వెళ్లిపోయారు అని అంటున్నారు.
కాగా ఈ కార్యక్రమానికి ముందు రోజే పూనమ్ ఫేస్ బుక్‌లో పెట్టిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘‘కొందరు కాన్సెప్ట్, డైలాగ్స్ కాపీ చేసి బట్టలు మార్చుకొంటున్నారు. మనషులను మారుస్తూ, మాట మీద ఉండకుండా ఉంటున్నారు. అమాయక జనాలతో ఆడుకొంటున్నారు అని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. వేష, భాషలను మారుస్తూ జనాలను మభ్య పెడుతున్నారు. అమ్మాయిలను అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల్లో నిజం ఏంటో భగవంతుడే తెలియజెప్పాలి. అందుకోసం భగవంతుడ్ని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను’’ అని పూనమ్ ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేశారు. పూనమ్ చేసిన వ్యాఖ్యలు పవన్‌నుద్దేశించే అంటూ సోషల్ మీడియాలో చాలామంది అభిప్రాయపడ్డారు.