పవన్ కళ్యాణ్ ఫాన్స్-కత్తి మహేష్ మధ్య వివాదంలో తానుగా కోరుకోకపోయినా ఒక ట్విట్టర్ మెసేజ్ వల్ల వచ్చి ఇరుక్కుపోయిన హీరొయిన్ పూనం కౌర్ మళ్ళి తన మాటలకు పదును పెంచింది. గతంలో ఆ వివాదం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మీడియాలో బాగా నానిన పూనం కౌర్ పేరు ప్రస్తుతం ఎక్కడా వినిపించడం లేదు. తాజాగా తన కొత్త ట్వీట్లతో కొంత అయోమయానికి గురి చేసేలా సందేశం పెట్టడంతో ఇవి ఎవరి గురించా అని పవన్ ఫాన్స్ తో పాటు కత్తి మహేష్ మద్దతుదారులు కూడా ఆలోచనలో పడ్డారు. పూనం కౌర్ ట్వీట్ లో ఉన్న మెసేజ్ ఇది.
డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు, మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయితీ నీ గుణం ఏంటి? ఇంతే ఆ మెసేజ్. కేవలం ఈ రెండు లైన్లు మాత్రమే పోస్ట్ చేసిన పూనం కౌర్ పెద్ద చర్చకే అవకాశం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలకు స్వస్తి చెప్పి ప్రజా క్షేత్రంలోకి వెళ్ళిపోయిన సమయంలో ఇలా చెప్పడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. చివరి ఘట్టంలో కత్తి మహేష్ కు, పవన్ ఫాన్స్ కు టీవీ ఛానల్స్ స్టూడియోలలో రాజీ కుదరడంతో ఆ వ్యవహరాన్ని ఉద్దేశించి ఏమైనా అందా అనే విశ్లేషణ కుడా సాగింది .
కాని మరో కొత్త మెసేజ్ లో ఇది ఏ వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదని, ఓ 14 ఏళ్ళ అమ్మాయిని ఒక కసాయి తండ్రి అమ్మేస్తే తాను 24 ఏళ్ళకే 7 సంవత్సరాల బిడ్డకు తల్లిగా మారాల్సి వచ్చిందని, విదేశాల్లో బాధితురాలిగా ఉన్న ఆ అమ్మాయి అక్కడ నుంచి తప్పించుకుని ఇటీవలే ఇండియాకు తిరిగివచ్చి తన తల్లితో పాటు బిడ్డను కూడా చూసుకుంటోదని, తన బలం స్పూర్తినివ్వడం వల్లే ఆ తండ్రిని ఉద్దేశించి మెసేజ్ పెట్టానని చెప్పింది.సదరు అమ్మాయి ఇప్పుడు ఫాషన్ డిజైనర్ అని కూడా చెప్పింది
పూనం చెప్పిన దానికి మెసేజ్ కు పూర్తిగా సింక్ కాకపోయినా ఏదో అనుమానం తలెత్తుతుంది. అంత స్ఫూర్తినిచ్చిన ఆ అమ్మాయి పేరైనా కనీసం చెప్పి ఉంటే బాగుండేది అని కొందరు పవన్ ఫాన్స్ అభిప్రాయ పడ్డారు. ఇలా క్లారిటీ లేకుండా చెప్పే బదులు పూర్తి వివరాలు, ఆధారాలు కూడా చూపిస్తే బాగుండేది కదా అని కొందరు తనకు సమాధానంగా అందులో చెప్పారు. ఇక అక్కడితో ఆ టాపిక్ వదిలేసి పద్మావత్, భాగమతి సినిమాల విజయాలను ఉదాహరిస్తూ ఇదే మహిళా శక్తి అని టాపిక్ ని ముగించే ప్రయత్నం చేసింది పూనం. పెద్దవాళ్ళు ఊరికే అనలేదుగా ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే అని. నిజమే మరి.