చాలా గ్యాప్ తర్వాత `నాతి చరామి` చిత్రంతో పూనమ్ కౌర్ తిరిగి కంబ్యాక్ అవుతోంది. ఈ చిత్రానికి జర్నలిస్ట్ నాగు గవర దర్శకత్వం వహించారు. తాజా ప్రమోషనల్ ఈవెంట్ అనంతరం ఇంటర్వ్యూలో పూనమ్ పలు సంచలన విషయాలను మాట్లాడింది.
తొలిగా సినిమా అలాగే తన కంబ్యాక్ గురించి చెబుతూ..ఇక్కడ నించుని మూవీ గురించి మాట్లాడతానని అనుకోలేదు! కానీ అన్నీ మంచికే జరుగుతాయని చెబుతారు. నేను కొంత గ్యాప్ తర్వాత హీరోయిన్ సెంట్రిక్ సినమా చేసాను. రియల్ లైఫ్ ఆధారంగా రూపొందించిన సినిమా ఇది. లేడీ ఓరియెంటెడ్ కాబట్టి మహిళా దినోత్సవాన ట్రైలర్ ని విడుదల చేయాలని అనుకున్నాం. ఉమెన్స్ కోసం చేసిన సినిమా ఇది. చాలా రోజుల తర్వాత అని కాదు దేవుడు అలా చేయించాడు... అని నర్మగర్భంగా అన్నారు పూనమ్.
పరిశ్రమలో కొందరు నన్ను రకరకాల సందర్భాల్లో నెగెటివ్ చేయాలనుకున్నారు. పూనమ్ కౌర్ ని చాలా రకాలుగా పుల్ చేయాలనుకున్నారు. కానీ నా వర్క్ అన్నిటినీ మాట్లాడుతుంది.. అని తనపై జరిగిన కుట్రల గురించి ప్రస్థావించారు. యాక్షన్ సినిమా చేస్తున్నారా? అన్న ప్రశ్నకు... నేను ఎక్కువ సినిమాల్లో యాక్షన్ పాత్రలు చేయలేదు. చేసినవి రిలీజ్ కాలేదు. చాలా పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చినా రకరకాల కారణాలతో బయటికి వచ్చేశాను.. దానికి కారణం వేరు... అని వెల్లడించింది. ఒక వల్నరబుల్ అమ్మాయిని తొక్కేడం మిస్ యూజ్ చేయడం చాలా ఈజీ అని కూడా వ్యాఖ్యానించారు.
రావణులు అంటూ ఘాటుగానే..!
నటిగా పూనమ్ కౌర్ కెరీర్ గురించి తెలిసినదే. అయితే తాను ఎదగలేకపోవడానికి కారణాలు చెబుతూ రావణుడు అంటూ వ్యాఖ్యానించారు ఓ ఇంటర్వ్యూలో. ఇకపోతే తన కెరీర్ ని రావణులు చెడగొట్టారని పూనమ్ కౌర్ తాజాగా ఆరోపించారు. అయినా తాను సీత.. ద్రౌపది వంటి మహాసాధ్విల స్ఫూర్తితో నిలదొక్కుకుంటానని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో కొందరు వ్యక్తులు తన జీవితాన్ని నాశనం చేశారని కూడా ఆవేదన చెందారు. మూడేళ్లుగా వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా ఎంతో నష్టాన్ని చవిచూసానని కూడా పూనమ్ అన్నారు. పెద్ద చిత్రాల్లో అవకాశాలొచ్చినా కొందరు రావణులు చెడగొట్టారని పూనమ్ తీవ్రంగా ఆరోపించారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ కామెంట్లపై చర్చ సాగుతోంది. తనని నాశనం చేసిన రావణుడు ఎవరు? అన్నదానిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. వినాయకుడు లాంటి హిట్ చిత్రంతో కథానాయికగా కెరీర్ ప్రారంభించి 20 పైగా చిత్రాల్లో నాయికగా అవకాశాలు అందుకుంది పూనమ్. ఇటీవల సినిమా అవకాశాలు తగ్గాయి. అప్పట్లో బాహుబలి నిర్మాతలు తెరకెక్కిస్తున్న టీవీ సిరీస్ లో నటించినా కానీ అవేవీ కలిసి రాలేదు.
మాయాజాలం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది పూనమ్ కౌర్. తర్వాత పలు సినిమాల్లో సహాయకపాత్రలు చేసింది. రెండో లీడ్ అవకాశాల్ని అందుకుంది. సరైన అవకాశాలు లేక నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే చాలా గ్యాప్ తర్వాత పూనమ్ ఒక సినిమాలో నటిస్తోంది. అరవింద్ కృష్ణ- సందేష్ బురి- పూనమ్ కౌర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన `నాతి చరామి` విడుదలకు సిద్ధమవుతోంది. నాగు గవర దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియే 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై జై వైష్ణవి కె నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో అమెజాన్- హంగామా- సోనీ- టాటా స్కై- ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్-ఎంఎక్స్ ప్లేయర్ వంటి 20 ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో మార్చి 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం (మార్చి 8) హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.