తమిళ సూపర్ స్టార్ హీరో అజిత్ సంక్రాంతి సందర్బంగా తమిళ ప్రేక్షకుల ముందుకు 'విశ్వాసం' అనే చిత్రంతో వచ్చిన విషయం తెల్సిందే. రజినీకాంత్ 'పేట' చిత్రంతో పోటీ పడి మరీ 'విశ్వాసం' చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. రజినీకాంత్ పేట కంటే విశ్వాసం ఎక్కువ వసూళ్లను రాబట్టిందని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. దాదాపుగా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసిన 'విశ్వాసం'ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
తమిళంలో సూపర్ హిట్ అవ్వడం, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు, టాలీవుడ్ లో స్టార్ డం ఉన్న నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడం వంటి కారణాల వల్ల 'విశ్వాసం' చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని, తెలుగు ప్రేక్షకులు విశ్వాసం చిత్రానికి మంచి వసూళ్లు ఇస్తారని అంతా భావించారు. కాని అనూహ్యంగా తెలుగు ప్రేక్షకులు 'విశ్వాసం' చిత్రాన్ని తిరస్కరించారు. సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం దారుణంగా నమోదు అయ్యాయి. పెద్ద సినిమాలు, పోటీకి మంచి సినిమాలు ఏమీ లేకున్నా కూడా అజిత్ 'విశ్వాసం' మొదటి రోజు కేవలం 30 లక్షలకు అటు ఇటుగానే షేర్ ను రాబట్టినట్లుగా తెలుస్తోంది.
తమిళంలో 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన 'విశ్వాసం' చిత్రం మరీ ఇంత తక్కువ వసూళ్లను నమోదు చేయడంతో నిర్మాతలు కూడా అవాక్కవుతున్నారు. ఒకప్పుడు అజిత్ ను తెలుగు ఆడియన్స్ తెగ ఆధరించి, అభిమానించారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే అజిత్ లుక్స్ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి చాలా దూరంగా ఉంది. అందుకే అజిత్ ను ప్రేక్షకులు ఇప్పుడు ఆధరించే పరిస్థితి లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అజిత్ తర్వాత తర్వాత చేయబోతున్న సినిమాల పరిస్థితి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇంతే ఉంటుందనిపిస్తుంది.