మహర్షికి సీడెడ్.. యూఎస్ ఝలక్

Update: 2019-05-16 08:47 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా 'మహర్షి' మే 9 న రిలీజ్ అయింది.  ఇప్పటికి సరిగ్గా వారం రోజులు.  మొదటి రోజు నుండే సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కొందరు 'మెసేజ్ సూపర్' అని సినిమాను పొగుడుతూ ఉంటే మరి కొందరేమో రెండు మూడు సినిమాలను కలిపి ఈ సినిమాను తీసినట్టుందని అంటున్నారు.  ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయంలో కూడా కొన్ని ఏరియాల్లో రెస్పాన్స్ బాగుంటే.. కొన్ని ఏరియాల్లో నిరాశకలిగించేలా ఉండడం గమనార్హం.

ఈ సినిమా నైజామ్ ఏరియాలో రూ. 20 కోట్ల షేర్ మార్కును దాటిందని అంటున్నారు. ఇక ఆంధ్రా ఏరియాలో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ డీసెంట్ గా ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.  పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కూడా కలెక్షన్స్ బాగున్నాయట. అయితే సీడెడ్ ఏరియాలోనూ.. ఓవర్సీస్ లోనూ 'మహర్షి' పరిస్థితి భారీ నష్టాల దిశగా పయనిస్తోందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.

సీడెడ్ విషయమే తీసుకుంటే.. బ్రేక్ ఈవెన్ మార్క్ చేరడానికి రూ. 12 కోట్ల షేర్ వసూలు చేయాలి. ఇక్కడ మొదటి వారంలో రూ. 6.86 కోట్ల షేర్ మాత్రమే సాధించింది.  మొదటి వారం వసూళ్లు రెండో వారంలో ఉండవు.. తగ్గుతాయి.  ఇప్పటి పరిస్థితిని బట్టి చూస్తే సీడెడ్ కలెక్షన్స్ ఫుల్ రన్ లో రూ. 8 కోట్ల షేర్ మార్క్ ను దాటడమే కష్టం అన్నట్టుగా ఉన్నాయి.  సీడెడ్ కలెక్షన్స్ సంగతి ఇలా ఉంటే అమెరికా లో మరింత నిరాశాజనకంగా ఉంది.  యూఎస్ లో బ్రేక్ ఈవెన్ కావడానికి దాదాపుగా రూ. 13 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది. అంటే షుమారు 3.5 మిలియన్ డాలర్స్ వసూలు చేయాల్సి ఉంది.  ఇప్పటి వరకూ అమెరికాలో 'మహర్షి' కలెక్షన్ 1.6  మిలియన్ డాలర్స్ మాత్రమే.  ఫుల్ రన్ లో 2.5 మిలియన్ టచ్ చేస్తుందా అనేది అనుమానమే. సో..అమెరికాలో కూడా 'మహర్షి' కి భారీ నష్టాలు తప్పేలా లేవని ట్రేడ్ టాక్.

    

Tags:    

Similar News