కంటెంట్ ఉన్నా కలెక్షన్లు వీకే

Update: 2019-06-08 05:41 GMT
నిన్న చప్పుడు లేకుండా విడుదలైన విజయ్ అంటోనీ కిల్లర్ కు చాలా నీరసమైన ఓపెనింగ్స్ వచ్చాయి. అసలు రిలీజైన విషయం కూడా సగటు ప్రేక్షకుడికి పెద్దగా అవగాహన లేదంటే ఆశ్చర్యం లేదేమో. బిచ్చగాడుతో ఓవర్ నైట్ స్టార్ డం తెచ్చుకున్న విజయ్ అంటోనీ దాన్ని అట్టే కాలం నిలబెట్టుకోలేకపోయాడు. ఒకదాన్ని మించి ఒకటి అర్థం లేని కథలతో ప్రయోగాలతో మార్కెట్ ను బాగా డౌన్ చేసుకున్న ఇతనికి కిల్లర్ రూపంలో మంచి అవకాశం దక్కింది కాని పాపం దాన్ని క్యాష్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు.

నిజంగానే కిల్లర్ కు టాక్ తో పాటు రివ్యూస్ అంతో ఇంతో పాజిటివ్ గానే వచ్చాయి. ఈ వారం ప్రేక్షకుల సహనంతో ఆడుకున్న హిప్పి-సెవెన్ ల కంటే ఇది ఎన్నో రెట్లు నయమని అందరు ఒకేరకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా టికెట్ కౌంటర్ల దగ్గర భిన్నమైన పరిస్థితి నెలకొంది. చాలా బిసి సెంటర్లలో నిన్న ఉదయానికి కాని థియేటర్లు కన్ఫర్మ్ కాకపోవడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఇప్పుడు వచ్చిన పాజిటివ్ టాక్ ని కిల్లర్ ఎంతవరకు అనుకూలంగా మార్చుకుంటాడు అనేది అనుమానమే.

పైగా కిల్లర్ అనే నెగటివ్ టైటిల్ ఫ్యామిలీ సెక్షన్ ని దూరం పెడుతుండగా టైటిల్ అర్థం తెలియని సగటు మాస్ ప్రేక్షకుడు ఇది మన కప్పు కాఫీ కాదులే అని పట్టించుకోవడం లేదు. ఫలితంగా కిల్లర్ రన్ ఏమంత ఆశాజనకంగా లేదు. దానికి తోడు తెలుగు సినిమాలతో పాటు ఈద్ సందర్భంగా వచ్చిన సల్మాన్ ఖాన్ భారత్ ఎక్కువ స్క్రీన్లను లాక్ చేసుకోవడం కిల్లర్ కు ప్రతికూలంగా మారింది. విజయ్ అంటోనీ సినిమా అంటే టీవీలో వచ్చినప్పుడు చూద్దాంలే అనే రేంజ్ లో మార్కెట్ ని తగ్గించుకున్న విజయ్ అంటోనీ బిచ్చగాడు రేంజ్ సక్సెస్ పడితే తప్ప రికవర్ అయ్యేలా లేడు

    

Tags:    

Similar News