కరోనా విలయం తర్వాత థియేటర్లో విడుదలైన మొదటి తెలుగు చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ప్రేక్షకులతోపాటు.. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ మూవీపైనే దృష్టి నిలిపింది. ఆడియన్స్ వస్తారా? 50 శాతం ఆక్యుపెన్సీ ఎంత కలెక్షన్స్ రాబడుతుంది? ప్రొడ్యూసర్ గల్లాపెట్టె నిండుతుందా.. ఖాళీ అవుతుందా? ఇలా.. ఎన్నో సందేహాల నడుమ విడుదలైందీ చిత్రం. మరి, ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉందంటే...
క్రిస్మస్ కానుగా విడుదలైన ఈ మూవీ.. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు మంచి కలెక్షన్స్ సాధించిందంటున్నారు పరిశీలకులు. యావరేజ్ గా రూ.2 కోట్లు రాబడుతుందని అనుకున్నా.. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు గలలమనడంతో 2.91 కోట్ల షేర్ సాధించిందట. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 3.43 కోట్ల షేర్ ని సొంతం చేసుకుందని టాక్. క్రిస్మస్ హాలిడేతోపాటు చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో థియేటర్లకు జనం బాగానే వచ్చారని అంటున్నారు.
అయితే.. తెలుగు సినిమాకు ఎంతో ఇంపార్టెంట్ అయిన ఓవర్సీస్ లో మాత్రం పరిస్థితులు బాగోలేవు. అమెరికాలో పాండమిక్ కండిషన్ ఇంకా తీవ్రంగానే ఉంది. ఇది సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపిందని అంటున్నారు. యునైటెడ్ స్టేట్స్ లో 16 చోట్ల కలెక్షన్స్ వివరాలను పరిశీలించగా.. గురువారం ప్రీమియర్, శుక్రవారం మొత్తం ఆటలు కలిపి.. 13 వేల డాలర్లు వచ్చినట్టు చెబుతున్నారు.
యూఎస్ లో కరోనా తీవ్రంగా ఉండడం.. కరోనా స్ట్రెయిన్ విజృంభణ.. పైగా.. ఓటీటీల్లో పలు సినిమాలు అందుబాటులో ఉండడంతో జనాలు థియేట్లకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదని టాక్. ఇప్పటికీ అమెరికాలోని చాలా ప్రాంతాల్లో థియేటర్లు తెరుచుకోలేదు. దీంతో.. ఈ చిత్రం అక్కడ విడుదల కాలేదు. ఈ పరిస్థితి కూడా కలెక్షన్స్ పై ప్రభావం చూపింది. తెలుగు రాష్ట్రాల్లో ఫర్వాలేదనిపించినా.. ఓవర్సీస్ లో అంచనాలను అందుకోలేదని అంటున్నారు. మరి, ఇవాళ సండే. ఈ సెలవు రోజున ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.