కమెడియన్ గా స్టార్ స్టేటస్ సంపాదించిన కొందరు హీరోలుగా మారడం మామూలే. అయితే శ్రీనివాసరెడ్డి మాత్రం కమెడియన్ గా ఓ మోస్తరు స్థాయిలో ఉండగానే హీరో అయ్యాడు. ‘గీతాంజలి’లో అంజలికి జోడీగా శ్రీనివాసరెడ్డి అన్నపుడు చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ శ్రీనివాసరెడ్డి హీరో కాని హీరో పాత్రలో మెప్పించాడు. ఇప్పుడు హీరోగా రెండో సినిమా ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించాడు. ఐతే ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డికి జోడీగా నటించవద్దంటూ తనకు కొందరు అభ్యంతరాలు చెప్పారని అంటోంది కథానాయిక పూర్ణ.
‘‘శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి ‘గీతాంజలి’ సినిమాలోనే నేను చేయాల్సింది. కానీ కుదరలేదు. ఆ తర్వాత మరో సినిమా అనుకున్నా. అదీ కుదరలేదు. చివరగా ‘జయమ్ము నిశ్చయమ్మురా’కు కుదిరింది. శ్రీనివాసరెడ్డి రోగా నటించే సినిమా అనగానే కొంత మంది నన్నుఈ సినిమా చేయద్దు అన్నారు. ఐతే .కథ బాగా నచ్చడంతో అదేమీ ఆలోచించకుండా ఈ సినిమాలో నటించాను. ఎవరు ఏం చెప్పినా వింటాను కానీ... చివరగా నిర్ణయం మాత్రం నేనే తీసుకుంటాను’’ అని పూర్ణ చెప్పింది.
ఇక ఈ చిత్ర దర్శకుడు శివరాజ్ కనుమూరి గురించి చెబుతూ.. ‘‘నేను ఇప్పటి వరకు కొత్త డైరెక్టర్లతో చేశాను. సీనియర్ దర్శకులతో చేశాను. ఐతే శివరాజ్ తో చేస్తుంటే..ఎక్కడా కొత్త దర్శకుడు అనిపించలేదు. ఓ సీనియర్ డైరెక్టర్ తో పని చేసిన ఫీలింగ్ కలిగింది. ప్రతి సీన్ గురించి చాలా కేర్ తీసుకునేవారు. ఈ చిత్రానికి శివరాజ్ దర్శకుడే కాదు.. నిర్మాత కూడా. క్లైమాక్స్ సీన్స్ నాలుగు కెమెరాలతో చిత్రీకరించారు. నిర్మాణపరంగా ఏమాత్రం రాజీపడలేదు’’ అని పూర్ణ పేర్కొంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/