మైకేల్ జాక్సన్ తర్వాత పాప్ ప్రపంచంలో అంతటి పేరు.. క్రేజ్ సంపాదించుకున్న యువ సంచలనం జస్టిన్ బీబర్ ఇండియాలో అడుగుపెట్టాడు. ముంబయి ఎయిర్ పోర్టులో అతను కాలు మోపగానే మోతెక్కిపోయింది. బీబర్ ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసొచ్చింది. వేలమంది అతడికి స్వాగతం పలకడానికి అభిమానులు భారీ ఎత్తున గుమిగూడారు. బీబర్ వచ్చింది అర్ధరాత్రి దాటిన తర్వాత అయినా జనసందోహం పెద్ద ఎత్తునే కనిపించింది. భారత్ లో బీబర్ మూడు రోజుల పాటు పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన కోసం బీబర్ కొంచెం ఖరీదైన డిమాండ్లే నిర్వాహకుల ముందు పెట్టాడు.
బీబబర్ ను ప్రత్యేక జెట్ విమానంలో ఇండియాకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి రోల్స్ రాయిస్ కారులో లోవర్ పరెల్ హోటల్ కు తీసుకెళ్లారు. బుధవారం ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఇండియాలో బీబర్ తొలి ప్రదర్శన ఆరంభమవుతుంది. ఈ షోకు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఈ షో తర్వాత బీబర్ ఢిల్లీ.. ఆగ్రా.. జైపూర్ ల్లోనూ షోలు చేయనున్నాడు. ప్రపంచ యాత్రలో భాగంగా బీబర్ ఇండియాలో పర్యటిస్తున్నాడు. ఇక్కడి నుంచి మరో ఆసియా దేశానికి వెళ్లనున్నాడు. బీబర్ కు సల్మాన్ ఖాన్ వ్యక్తిగత బాడీ గార్డ్ షెరా.. సెక్యూరిటీ కల్పించనున్నాడు. సల్మాన్ వ్యక్తిగత సిబ్బంది అతడి కోసం పని చేయనున్నారు. ఈ పర్యటన మొత్తంలో వేల మంది పోలీసులు బీబర్ కు రక్షణ కల్పించనున్నారు.