బాలీవుడ్ లో మీటూ ఉద్యమంలో భాగంగా ఎంతో మంది స్టార్స్ పై హీరోయిన్స్- మహిళలు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. నానా పటేకర్ పై తనూశ్రీ దత్తాతో మొదలైన లైంగిక వేదింపు ఆరోపణలు మెల్ల మెల్లగా రాజుకుని ఎంతో మంది దర్శకులు, నిర్మాతలపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఎక్కువగా దర్శకుడు సాజిద్ ఖాన్ పై నే లైంగిక వేదింపుల ఆరోపణలు వచ్చాయి. సాజిద్ ఖాన్ తమను లైంగికంగా వేదించాడంటూ ముగ్గురు ఆధారాలతో సహా ఆరోపించడంతో ఆయనను బాలీవుడ్ కు దూరంగా ఉంచుతున్నారు.
ఆయన చేస్తున్న సినిమాలు, చేయాల్సిన సినిమాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఇలాంటి సమయంలో ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టర్స్ అసోషియేషన్ సాజిద్ ఖాన్ పై సంవత్సరం పాటు వేటు వేసింది. సంవత్సరం వరకు ఆయన సినిమాలు తీయడానికి వీలు లేదని, సంవత్సరం వరకు ఆయన డైరెక్టర్స్ అసోషియేషన్ లో మెంబర్ గా కూడా కొనసాగడు అంటూ నిర్ణయించారు.
సాజిద్ ఖాన్ పై పోలీసు కేసుతో పాటు కోర్టు లో కూడా కేసు నడుస్తోంది. ఆ కారణంగానే ముందు జాగ్రత్తగా సినీ పరిశ్రమ ఆయన పై అధికారికంగా వేటు వేయడం జరిగింది. మరి కొందరిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు వారిపై అధికారికంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాకుంటే వారితో వర్క్ చేసేందుకు స్టార్స్ ఎవరు ఆసక్తి చూపడం లేదు.