సిని'మా' అవార్డ్స్ లో ఎన్టీఆర్-పూరీల కాంబినేషన్ లో టెంపర్ చిత్రానికి మంచి ప్రాధాన్యత దక్కింది. ఉత్తమ నటుడు అవార్డ్ ఎన్టీఆర్ కి ఇవ్వగా.. ఉత్తమ సహాయ నటుడు కేటగిరీని కూడా టెంపర్ కే ఇచ్చారు. కానిస్టేబుల్ మూర్తిగా నటించిన పోసాని కృష్ణమురళికి బెస్ట్ ప్రామినెంట్ యాక్టర్ మేల్ అవార్డు లభించింది. ఆ పాత్రకి ఆ అవార్డు దక్కడం ఎంతైనా సముచితం అని అంగీకరించాల్సిందే.
అయితే.. అవార్డ్ తీసుకునేందుకు స్టేజ్ పైకి వచ్చిన పోసాని.. తనదైన శైలిలో మాటలతో అలరించాడు. రైటర్ గా, డైరెక్టర్ గా, యాక్టర్ గా ఎటు పోవాలో తెలీని పరిస్థితిలో ఉన్నపుడు రామ్ చరణ్ మూవీ నాయక్ లో చేసిన పాత్ర తర్వాత కెరీర్ టర్న్ అయిందని చెప్పిన పోసాని కృష్ణ మురళి.. అలాగే టెంపర్ లో చేసిన పాత్ర ద్వారా సుస్ధిరం అయిందన్నాడు. లవ్యూ రాజా అంటూ చెర్రీకి.. పూరీకి తన స్టైల్ లో థ్యాంక్స్ చెప్పాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. అక్కడే అసలు కథ మొదలైంది.
'రైటర్ గా, డైరెక్టర్ గా నాకు నంది అవార్డు ఎప్పుడో రావాల్సి ఉంది. ఎందుకు రాలేదో ఇప్పుడు అప్రస్తుతం' అన్నా అసలు విషయం మాత్రం చెప్పేశాడు. 'నా పేరు నామినేషన్స్ లో ఉందని మాటీవీ వాళ్లు చెప్పినపుడు ఆశ్చర్యపోయాను. నేను మా టీవీ వాళ్లను ఇన్ ఫ్లుయెన్స్ చేయకపోవడం వల్లనే బహుశా నాకు ఈ అవార్డు ఇచ్చి ఉంటారు' అంటూ నంది అవార్డులపై ఇన్ డైరెక్ట్ పంచ్ పేల్చేశాడు. అంటే నందులు ఇచ్చేది ఇన్ ఫ్లుయెన్స్ చేసే వాళ్లకే అనే కదా. వాటే కౌంటర్ పోసాని జీ! లవ్యూ రాజా..