కమ్మోడిని.. ఓట్లేయమని అడిగా-పోసాని

Update: 2016-04-02 10:00 GMT
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ పోసాని కృష్ణమురళి. సినిమాలకు సంబంధించి అయినా.. రాజకీయాల గురించి అయినా.. మనసుకు ముసుగేసుకోకుండా మాట్లాడేస్తుంటాడు పోసాని. చిరంజీవి పెట్టిన ‘ప్రజారాజ్యం’లో చేరి.. అందులో ఉన్నన్ని రోజులు తన మాటల పదును చూపించాడు పోసాని. ఐతే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాక మళ్లీ రాజకీయాల వైపు చూడలేదు పోసాని. ఐతే ఆయన అప్పుడప్పుడూ రాజకీయాల ప్రస్తావన తెస్తుంటారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంటారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉన్న పోసాని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి మాట్లాడారు. 2009 ఎన్నికల సందర్భంగా తాను కులం పేరు చెప్పి ఓట్లు అడిగిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

‘‘2009 ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లినపుడు నా కులమేంటో చెప్పా. నేను పోసాని కృష్ణమురళిని.. నేను కమ్మోడిని. నన్ను చిరంజీవి పంపించాడు. గెలిపించండి’’ అని ప్రజల్ని  అడిగినట్లు పోసాని చెప్పాడు. గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తా.. కానీ డబ్బులు మాత్రం ఖర్చుపెట్టనని తాను చెప్పానని.. ఐతే డబ్బులు పెట్టనందుకే తనను ప్రజలు ఓడించారని అన్నాడు. జనాలకు డబ్బులు పంచకపోయినప్పటికీ తనకు ఏడు లక్షల రూపాయల దాకా ఖర్చయిందని.. ఎన్నికల తర్వాత తనకు రాజకీయాలు సెట్ కావని తెలుసుకున్నాని పోసాని చెప్పాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకు చాలా అవకాశాలున్నాయని.. తన కెరీర్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నానని.. రచనను పక్కన పెట్టేశానని పోసాని తెలిపాడు.
Tags:    

Similar News