శ్రీదేవి బ‌యోపిక్.. రెండు సీక్వెల్స్‌!!

Update: 2018-02-26 23:30 GMT
బాలీవుడ్‌... టాలీవుడ్‌... కోలీవుడ్ అనే తేడా లేదు... ఎక్క‌డైనా జీవిత‌క‌థ‌ల‌ను సినిమాలుగా మార్చ‌డానికి సిద్ధంగా ఉన్న ద‌ర్శ‌కులెంద‌రో ఉన్నారు. ఆ కోవ‌లోనే ఇప్పుడు మ‌హాన‌టి సావిత్రి కథ సిద్ధ‌మ‌వుతోంది. అతి త్వ‌ర‌లో శ్రీదేవి జీవితం కూడా సినిమాగా మెరిసే అవ‌కాశం క‌నిపిస్తోంది. కానీ... ఆ సినిమా ఎవ‌రు తీస్తారు? మ‌న వాళ్లు తీస్తే బోనీ ఊరుకుంటాడా?

మేరీకోమ్‌...ఎమ్మెస్ ధోనీ...బాగ్ మిల్కా భాగ్‌... దంగ‌ల్‌...నీర్జా...డ‌ర్జీ పిక్చ‌ర్‌...తాజాగా ప్యాడ్ మ్యాన్‌... ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా బోలెడు సినిమాలు ఉన్నాయి. అవ‌న్నీ బ‌యోపిక్‌లే. అంటే బాలీవుడ్‌లో బ‌యోపిక్‌లా హ‌వా బాగానే కొన‌సాగుతోంది. ఇక టాలీవుడ్ విష‌యానికి వ‌స్తే... బ‌యోపిక్‌లపై ప్ర‌స్తుతం బాగానే ఆస‌క్తి చూపిస్తున్నారు మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా. ఎన్టీఆర్ బ‌యోపిక్, మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్‌లు ప్ర‌స్తుతం సిద్ద‌మవుతున్నాయి. సావిత్రి బ‌యోపిక్ ప్ర‌ముఖ నిర్మాత అశ్వినీద‌త్ నిర్మిస్తున్నాడు. అత‌డిని శ్రీదేవి అపార‌మైన ప్రేమ‌ - గౌర‌వం. ఆమెతో క‌లిసి త‌మ వైజ‌యంతి మూవీస్ ప‌తాకంపై మూడు సినిమాలు తీశారు.

ఆ అద్భుత సౌంద‌ర్య‌రాశి నేల విడిచి నింగిని చేరిందన్న విష‌యం అశ్వినీ ద‌త్ విని చ‌లించిపోయారు. శ్రీదేవి జీవిత‌క‌థ‌ను కూడా సినిమాగా తీయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. కానీ అది సాధ్య‌మ‌వుతుందా? ఎందుకంటే శ్రీదేవి ఒక్క టాలీవుడ్‌కే అంకిత‌మైన హీరోయిన్ కాదు. అయిదు భాష‌ల్లో వెండితెరను ఏలిన న‌టి. బాలీవుడ్‌లో కూడా తారాస్థాయికి చేరింది ఆమె. ఇక ఆమె భ‌ర్త బోనీ క‌పూర్ బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తి. మ‌న తెలుగు వాళ్లు సినిమా తీస్తామంటే బోనీ ఒప్పుకుంటాడా?  నా భార్య క‌థ‌... నా ఇష్టం అనే అవ‌కాశం కూడా ఉంది. ఒక వేళ మ‌న‌వాళ్లు సినిమా తీసినా... కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవ‌డాలు - విడుద‌ల కాకుండా అడ్డుకోవ‌డాలు కూడా సాధ్య‌మే.

నిజానికి శ్రీదేవి బ‌యోపిక్ ఒకే ఒక్క సినిమాగా తీస్తే స‌రిపోదు. తెలుగులో ఆమె సినిమా జ‌ర్నీనీ ఒక సీక్వెల్‌... అది కూడా తెలుగు ద‌ర్శ‌కుడు తీస్తే బాగుంటుంది. ఇక ఆమె హిందీలో తారాప‌థానికి చేరిన ప్ర‌యాణాన్ని బాలీవుడ్ ద‌ర్శ‌కులే రెండో సీక్వెల్‌ గా తీస్తే బాగుంటుంది. నిజానికి శ్రీదేవి హిందీలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. క‌నుక బాహుబ‌లి త‌ర‌హాలో... శ్రీదేవి బ‌యోపిక్ రెండు సీక్వెల్స్‌లా వ‌స్తే ఇటు తెలుగు ప‌రిశ్ర‌మ‌కు - అటు హిందీ ప‌రిశ్ర‌మ‌కు కూడా న్యాయం జ‌రిగిన‌ట్టే.
Tags:    

Similar News