టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ కెరీర్ ప్రారంభం నుంచీ వేటికవే ప్రత్యేకమైన కథలతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పరాజయాలు ఎదురైనా అదే విధంగా ముందుకు సాగుతున్నాడు.
'గౌరవం' చిత్రంతో హీరోగా లాంచ్ అయిన శిరీష్.. 'కొత్త జంట' 'శ్రీరస్తు శుభమస్తు' 'ఒక్క క్షణం' 'ఏబీసీడీ' వంటి డీసెంట్ చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు 'ఊర్వశివో రాక్షసివో' వంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ చిత్రం శుక్రవారం (నవంబర్ 4) థియేటర్లలోకి వచ్చింది. యూత్ ఫుల్ కంటెంట్ తో రూపొందిన ఈ చిత్రానికి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ లభించింది.
ఈ వారం విడుదలైన సినిమాల్లో 'ఊర్వశివో రాక్షసివో' కే ఎక్కువ మంది ఓటేస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ సినిమాని చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ట్రెండ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నమోదయ్యేలా ఉన్నాయి.
ఈ సినిమాతో అల్లువారబ్బాయి సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లే అనిపిస్తోంది. శిరీష్ కెరీర్ లో ఇప్పటి వరకూ 'కొత్త జంట' 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలు సూపర్ హిట్లు కాకపోయినా ఓకే అనిపించాయి. ఇప్పుడు 'ఊర్వశివో..' చిత్రంతో మంచి కమర్షియల్ హిట్టు అతని ఖాతాలో పడబోతోందని అనుకోవాలి.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ మూడు సినిమాలు కూడా అల్లు వారి గీతా ఆర్ట్స్ లో రూపొందినవే. బయట బ్యానర్స్ లో చేసిన చిత్రాలు శిరీష్ కు సక్సెస్ అందించలేదు కానీ.. హోమ్ బ్యానర్ లో చేసిన మూవీస్ మాత్రం హీరోగా నిలబెట్టాయి.
రాకేష్ శశి దర్శకత్వం వహించిన 'ఊర్వశివో రాక్షసివో' చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు. జీఏ2 పిక్చర్స్ మరియు శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై తమ్మారెడ్డి భరద్వాజ - ధీరజ్ మొగిలినేని - విజయ్ ఎం సంయుక్తంగా నిర్మించారు.
నిజానికి 'ప్రేమ కాదంట' అనే పేరుతో చాన్నాళ్ల ముందే ఈ చిత్రాన్ని రెడీ చేసారు. కానీ ఆ తర్వాత కొన్ని రిపేర్లు చేసి 'ఊర్వశివో రాక్షసివో' గా సిద్ధం చేసారు. పెద్ద సినిమాలన్నీ విడుదలైన తర్వాత మంచి సమయం చూసుకొని థియేటర్లలోకి తీసుకొచ్చారు.
అంతేకాదు నందమూరి బాలకృష్ణ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తీసుకొచ్చి ఒక్కసారిగా సినిమా చుట్టూ సందడి నెలకొనేలా చేసారు. ఇవన్నీ అల్లు అరవింద్ వల్లే కుదిరాయనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇలా శిరీష్ కెరీర్ ను మెగా నిర్మాత మరోసారి నిలబెట్టారని చెప్పాలి.
ఊర్వశివో తో ట్రాక్ లోకి వచ్చిన శిరీష్.. ఇకపై తనకు సూట్ అయ్యే మంచి కథలను ఎంచుకుంటూ పోతే, అతని సినీ ప్రయాణం కూడా సక్సెస్ ఫుల్ గా సాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఇంకా తదుపరి ప్రాజెక్ట్ కు అల్లువారబ్బాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ జోష్ లో త్వరలోనే అనౌన్స్ మెంట్ ఇస్తాడేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.