ఈ స్టార్‌ కూడా క్యాన్సర్‌ ను జయించినట్లేనా?

Update: 2019-03-06 12:02 GMT
బాలీవుడ్‌ లో ఈమద్య కాలంలో క్యాన్సర్‌ అనేది చాలా కామన్‌ అయ్యింది. ప్రముఖులు ఎంతో మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. ఈమద్య కాలంలో క్యాన్సర్‌ బారిన పడ్డ వారిలో సోనాలి బింద్రే, ఇర్ఫాన్‌ ఖాన్‌, రాకేష్‌ రోషన్‌ ఉన్నారు. ప్రస్తుతం వీరంతా కూడా చికిత్స తీసుకుంటున్నారు. సోనాలి బింద్రే క్యాన్సర్‌ ను దాదాపుగా జయించినట్లే అంటూ బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తాజాగా ప్రముఖ నటుడు రిషి కపూర్‌ కూడా క్యాన్సర్‌ తో బాధపడుతున్నట్లుగా వెళ్లడయ్యింది. ఆయన ప్రస్తుతం క్యాన్సర్‌ నుండి కోలుకుంటున్నట్లుగా ఆయన కుటుంబ సభ్యులు సోషల్‌ మీడియా పోస్ట్‌ లను చూస్తుంటే అర్థం అవుతుంది.

కొన్ని రోజుల క్రితం రిషి కపూర్‌ క్యాన్సర్‌ చికిత్స కోసం అమెరికా వెళ్లడం జరిగింది. అమెరికా వెళ్తున్న సమయంలోనే నేను చికిత్స కోసం వెళ్తున్నాను, సినిమాలకు కాస్త గ్యాప్‌ రావచ్చు, ఇన్నాళ్లు మీరు నా వెంట ఉన్నారు. ఇప్పుడు కూడా నా వెంట మీ అభిమానం ఉంది కనుక నేను త్వరలోనే తిరిగి వస్తాను. తప్పకుండా మళ్లీ నటిస్తాను అంటూ చెప్పాడు. కొన్ని రోజులుగా ఎలాంటి అప్‌ డేట్‌ లేదు. అయితే మళ్లీ రెండు మూడు రోజులుగా కుటుంబ సభ్యులు రిషి కపూర్‌ తో ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేయడంతో పాటు, ఆరోగ్యంగా ఉన్నారు అంటూ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

రిషి కపూర్‌ ఇండియాకు తిరిగి రాబోతున్నారు. మరి కొన్ని రోజుల్లో ఇండియాకు తిరిగి వెళ్లబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. సంపూర్ణ చికిత్స తీసుకున్న రిషి కపూర్‌ క్యాన్సర్‌ నుండి పూర్తిగా బయట పడ్డారు అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు.  అయితే ఆ విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు వెళ్లడించలేదు. అత్యాధునిక వైధ్య సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో క్యాన్సర్‌ ను మొదటి స్టేజ్‌ లోనే గుర్తిస్తే సులువుగానే నయం అవుతుంది. బాలీవుడ్‌ స్టార్స్‌ ఎక్కువ శాతం క్యాన్సర్‌ మొదటి దశలో ఉండగానే గుర్తిస్తున్నారు. కనుక వారు బతికి బట్ట కడుతున్నారు.
Tags:    

Similar News