తమ హీరోని, సినిమాని విభిన్నంగా ప్రెజెంట్ చేసేందుకు.. పోస్టర్ లే ప్రధాన ఆయుధం మూవీ మేకర్స్ కి. అందుకే మూవీలోని అద్భుతమైన స్టిల్స్ ని ఎంచుకుని, క్రియేటివ్ గా డిజైన్ చేసి.. రిలీజ్ చేస్తుంటారు. అయితే కొన్ని కామన్ పాయింట్స్ సెంటిమెంట్స్ గా మారిపోతుంటాయి. తాజాగా సుబ్రమణ్యం ఫర్ సేల్ - అఖిల్ మూవీలకు.. కాలు పైకి లేపుతూ హీరోలు సాయిధరం తేజ్ - అఖిల్ లు ఇచ్చిన ఫోజులు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.
నిజానికి ఈ విషయంలో ట్రెండ్ సెట్టర్ పవన్ కళ్యాణ్. జల్సా సినిమా కోసం.. ఓ కాలుని దాదాపు తల కంటే హైట్ లేపి.. పవర్ స్టార్ ఇచ్చిన స్టిల్ ఓ సెన్సేషన్. త్రివిక్రం శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఆ మూవీ అంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్. ఆ తర్వాత త్రివిక్రం తీసిన ఖలేజా మూవీకోసం.. ఇచ్చిన పోస్టర్ లలో మహేష్ బాబు కూడా ఇలాంటి లెగ్ లిఫ్టింగ్ స్టిల్ ఇచ్చాడు. అయితే.. ఇది ఓ సన్నివేశంలోనిది. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా రామయ్యా వస్తావయ్యా చిత్రం కోసం కాలు పైకి లేపిన ఫోజ్ తో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. యంగ్ టైగర్ ఇచ్చి ఫోజ్ అయితే.. ఓ పాటలోనిది కావడం విశేషం.
ఇప్పుడు సాయిధరం తేజ్ అయితే.. పవన్ కళ్యాణ్ జల్సా పోస్టర్ ని మక్కీకి మక్కీ దించేశాడు. కాకపోతే కాలు మార్చాడంతే. కానీ ఇది పవన్ కి బర్త్ డే విషెస్ చెబుతూ రిలీజ్ చేసినది కావడంతో.. ఈ హీరో కూడా మెగా వారసుడే కావడంతో కాపీ ఆరోపణలు పెద్దగా రాలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఇలా లెగ్ లిఫ్టింగ్ ఫోజ్ ఇచ్చినోడు అక్కినేని వారసుడు అఖిల్. ఇప్పటికే డ్యాన్సులు, ఫైట్ల విషయంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకునేందుకు అఖిల్ కష్టపడుతున్నాడనే విషయం అర్ధమైంది. పోస్టర్లలో కూడా క్రియేటివిటీతో కట్టిపడేసే ప్రయత్నం చేస్తున్నారు అఖిల్ యూనిట్.
కానీ ఇలా కాలు లేపుతూ ఫోజులిచ్చిన వాటిలో ఇఫ్పటివరకూ జల్సా ఒకటే హిట్. రామయ్యావస్తావయ్యా - ఖలేజాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో అఖిల్ - సుబ్రమణ్యం ఫర్ సేల్ రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ లో ఉత్కంఠ, ఆతృతలు నెలకొన్నాయి.