పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనతో సినిమాలు పూర్తి చేయాలని గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న డైరెక్టర్లకు బిగ్ టాస్క్ ని సెట్ చేశాడా? అంటే టాలీవుడ్ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జనసేన పార్టీ కార్యకలాపాల్లో భాగంగా పవన్ కల్యాణ్ దాదాపు మూడున్నరేళ్లు సినిమాలకు విరామం తీసుకున్నారు. ఆ తరువాత రీమేక్ మూవీ 'వకీల్ సాబ్'తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
రీమేక్ ఫిల్మ్ తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ తరువాత కూడా రీమేక్ లపైనే ప్రత్యేక దృష్టిని పెట్టారు. మలయాళ ఫిల్హ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' ఆధారంగా రూపొందిన 'భీమ్లానాయక్'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్యాన్స్ కు ఊరట కలిగించింది. ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు కానీ పవన్ మాత్రం సైలెంట్ అయిపోయాడు. కరోనా ముందు క్రిష్ డైరెక్షన్ లో ప్రారంభించిన పీరియాడిక్ ఫిల్మ్ 'హరి హర వీరమల్లు'ని కూడా పూర్తి చేయకుండా హోల్డ్ లో పెట్టేశాడు.
దీంతో ఈ ప్రాజెక్ట్ ని అయినా పవన్ పూర్తి చేస్తాడా? లేక మధ్యలోనే ఆపేస్తాడా? అని అభిమానులు గత కొన్నినెలలుగా తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఇదిలా వుంటే తమిళ హిట్ మూవీ 'వినోదాయ సితం'ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేశారు. సముద్రఖని దర్శకత్వంలో ఈ మూవీని చేయాలనుకున్నారు. కానీ ఇది కూడా సెట్స్ పైకి వెళ్లలేదు. అంతకు ముందు ప్రకటించిన 'భవదీయుడు భగత్ సింగ్' కూడా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందన్న విషయంలో క్లారిటీ లేకపోవడం, పవన్ ఏపీ లో బస్ యాత్రకు రెడీ అవుతున్నారంటూ వార్తలు రావడంతో ఫ్యాన్స్ మరింత ఆందోళనకు గురయ్యారు.
అయితే తాజాగా పవన్ ఏపీ అంతట చేయాలనుకున్న బస్ యాత్ర పోస్ట్ పోన్ కావడంతో మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే యాభై శాతం పూర్తయిన 'హరి హర వీరమల్లు' ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందు కోసం అక్టోబర్ నుంచి డేట్స్ కేటాయించబోతున్నాడట. నవంబర్ వరకు ఈ మూవీని పూర్తి చేసి డిసెంబర్ నుంచి 'వినోదాయ సితం' రీమేక్ కు వెళ్లనున్నాడ. అంటే ఇద్దరు దర్శకులకు మూడు నెలల టైమ్ మాత్రమే పవన్ కేటాయించినట్టుగా తెలుస్తోంది.
అంతులో 'వినోదాయ సితం' రీమేక్ కోసం మాత్రం పవన్ కేవలం 25 రోజుల కాల్షీట్స్ ని మాత్రమే కేటాయించినట్టుగా తెలుస్తోంది. మూడు నెలల్లో రెండు సినిమాలని పూర్తి చేయాలని టైమ్ పీరియడ్ ని పవన్ సెట్ చేసుకోవడంతో ఇద్దురు డైరెక్టర్లకు టప్ జాబ్ గా మారనుందని తెలుస్తోంది. అయితే హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, సుజీత్ లతో చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్ లపై మాత్రం ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదని తెలుస్తోంది.
ఈ రెండు సినిమాలని పూర్తి చేసిన తరువాత పవన్ జనవరి నుంచి సినిమాలకు దూరంగా పాలిటిక్స్ కి దగ్గరగా వెళ్లనున్నారని ఇన్ సైడ్ టాక్. మరి ఎన్నికల తరువాతైనా హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, సుజీత్ ప్రాజెక్ట్ లపై ఆలోచిస్తారా లేదా? అన్నది తెలియాల్సి వుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.