ప‌వ‌ర్ స్టార్ ..సూప‌ర్ స్టార్ ని బీట్ చేస్తారా?

Update: 2022-02-23 07:30 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన క్రేజీ మూవీ `భీమ్లా నాయ‌క్‌`. ఈ మూవీ రిలీజ్ కోసం గ‌త కొన్ని నెల‌లుగా అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపుల‌కు తెర‌దించుతూ ఈ మూవీని ఎట్ట‌కేల‌కు ఫిబ్ర‌వ‌రి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. రానా ద‌గ్గుబాటి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీని సాగ‌ర్ కె. చంద్ర తెర‌కెక్కించారు. త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డంతో ఈ సినిమాపై క్రేజ్ మ‌రింత పెరిగింది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు.

ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ సినిమాపై మ‌రింత క్రేజ్ ని క్రియేట్ చేసింది. దీంతో ప్రీమియ‌ర్ ల‌పై క్రేజ్ మ‌రింత పెరిగింది. ఇప్ప‌టికే యూఎస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జ‌రిగి రికార్డు సృష్టిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో యూఎస్ ప్రీమియ‌ర్స్  పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నెల 24న యూఎస్ ప్రీమియ‌ర్స్ నిర్వ‌హించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఇందు కోసం రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రిగాయి.

ఈ చిత్రంలో ప‌వ‌న్ తో పాటు రానా కూడా న‌టించ‌డంతో సినిమాకు మ‌రింత ప్ల‌స్ గా మారింద‌ని, యూఎస్ లో ఈ కాంబినేష‌న్ మ‌రింత ప్ర‌భావాన్ని చూపించ‌నుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమాతో అయినా ప‌వ‌న్ .. సూప‌ర్ స్టార్ మహేష్ బాబుని బీట్ చేస్తారా? అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు.

యూఎస్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చిత్రాల‌కు మించి మ‌హేష్ భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టాడు. ప‌వ‌న్ న‌టించిన `అజ్ఞాత‌వాసి` 2 మిలియ‌న్ గ్రాస్ ని వ‌సూలు చేసింది. అయితే మ‌హేష్ న‌టించిన `భ‌ర‌త్ అనే నేను` 3.4 మిలియ‌న్ గ్రాస్ వ‌సూలు చేయ‌గా..`శ్రీ‌మంతుడు`  2.8 మిలియ‌న్ గ్రాస్ ని రాబ‌ట్టింది.

ఇక అనిల్ రావిపూడితో చేసిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` 2.2 మిలియ‌న్ గ్రాస్ ని వ‌సూలు చేసింది. అయితే `భీమ్లా నాయ‌క్‌` ఈ రికార్డుని బ్రేక్ చేస్తాడా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. గ‌తంలో పోలిస్తే ప‌వ‌న్ సినిమాకు ఇక్క‌డ భారీ బ‌జ్ క్రియేట్ అయింద‌ని, ఖ‌చ్చితంగా ఈ సారి `భీమ్లా నాయ‌క్‌` తో ప‌వ‌న్ భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం ఖాయం అని అంటున్నారు.

ఇప్ప‌టికే టీజ‌ర్, ట్రైల‌ర్ తో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న `భీమ్లా నాయ‌క్‌` ఫ‌స్ట్ డే పాజిటివ్ టాక్ ని తెచ్చుకోగ‌లిగితే వ‌సూళ్ల ప్ర‌వాహానికి అడ్డు అదుపు వుండ‌ద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. ఏం జ‌ర‌గ‌నుంద‌న్న‌ది తెలియాలంటే భీమ్లా నాయ‌క్` రిలీజ్ కోసం  మ‌రి కొన్ని గంట‌లు ఎదురుచూడాల్సిందే.
Tags:    

Similar News