దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లకు ధీటుగా అజయ్ పాత్రని జక్కన్న క్రియేట్ చేసాడు. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయింది. ఇందులో అజయ్ రోల్ ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పటివరకు అనేక వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అజయ్ బర్త్ డే కానుకగా చిత్ర బృందం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది. శత్రు మూకలు ఆయన్ని చుట్టుముట్టి తుపాకులు ఎక్కు పెట్టగా.. 'లోడ్ ఎయిమ్ షూట్' అంటూ గంభీరమైన వాయిస్ తో అజయ్ లుక్ ని చూపించారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి RRR లో అజయ్ ఎలాంటి క్యారక్టర్ పై పడింది.
మోషన్ పోస్టర్ తోనే అజయ్ దేవ్‌గణ్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో తెలియజేసారు. కాకపోతే ఇక్కడ అతని పాత్ర పేరుని వెల్లడించలేదు. అయితే 'లోడ్.. ఎయిమ్.. షూట్' అనే వాయిస్ ని బట్టి ఇందులో ఆయన బ్రిటీష్ వారికి తుపాకులని గురి పెట్టడానికి సైన్యాన్ని రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ లకు గురువుగా మారతాడాని ప్రచారం జరుగుతోంది. ఆయనకు జోడీగా శ్రీయా నటిస్తారని టాక్. ఇందులో నిజమెంతో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
ఇకపోతే ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ కనిపించనున్నారు. ఇప్పటికే 80 శాతం పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని 2021 అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. డీవీవీ దానయ్య సుమారు 450 కోట్ల బడ్జెట్ తో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.