కొత్త తరహా కథలకంటే కూడా ఇటీవల కాలంలో పాత కథలనే మళ్లీ చూపించాలి అని సీక్వెల్స్ ను గ్రాండ్ గా తెరపైకి తీసుకువచ్చేందుకు దర్శక నిర్మాతలో బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ ఫార్ములా ఇతర ఇండస్ట్రీలో కంటే కూడా తమిళ చిత్రపరిశ్రమంలోనే ఎక్కువగా హైలెట్ అవుతూ వస్తోంది.
ఇటీవల రాఘవ లారెన్స్ తో చంద్రముఖి సీక్వెల్ తెరపైకి తీసుకురాబోతున్నట్లు దర్శకుడు వాసు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. రజనీకాంత్ తో చేసిన ప్రయోగం ఇప్పుడు రాఘవ లారెన్స్ తో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది.
అలాగే మరొకవైపు దర్శకుడు శంకర్ రెండు సినిమాలకు సీక్వెల్స్ ను తెరపైకి తీసుకురాబోతున్నాడు. ముందుగా ఇండియన్ 2 మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 26 ఏళ్ల అనంతరం మళ్లీ కమలహాసన్ తోనే సరికొత్త మెస్సేజ్ తో రావాలని అనుకుంటున్నారు. కానీ ఆ సినిమా ఆర్థిక కారణాల వలన నిర్మాతలతో దర్శకుడికి విభేదాలు రావడంతో సగంలోని ఆగిపోయింది.
త్వరలోనే ఆ సినిమా మళ్ళీ మొదలు కానుంది. అలాగే అపరిచితుడికి కూడా సెకండ్ పార్ట్ ను ఫ్యాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు శంకర్. ఇక ఇదిలా ఉండగా శంకర్ మొదటి సినిమా జెంటిల్మెన్ సినిమాకు కూడా సీక్వెల్ రానుంది. ఆ చిత్రం నిర్మాత టి. కుంజుమోన్ 'జెంటిల్‌మేన్ 2'ను ప్రకటించారు. ఇంకా సినిమాలో హీరో ఎవరనేది ఫైనల్ కాలేదు కానీ దర్శకుడిగా నానీతో 'ఆహా కళ్యాణం' సినిమా తీసిన గోకుల్ కృష్ణ తెరకెక్కించబోతున్నాడు.
ఇక క్లాసిక్ దర్శకుడు మణిరత్నం కూడా మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని 500 కోట్ల భారీ బడ్జెట్ తో పోన్నియన్ సెల్వన్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల కానుండగా ఆ తర్వాత సీక్వెల్ ను వచ్చే ఏడాది విడుదల చేయాలని అనుకుంటున్నారు.
వీటితోపాటు రాఘవ లారెన్స్ కాంచన సినిమాకు కూడా సీక్వెల్ రానుంది. కార్తీ నటించిన ఖైదీ సీక్వెల్ తో పాటు సూర్య, అజిత్ కూడా కొన్ని హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీసుకురావాలి అని చూస్తున్నారు. మరి ఈ సీక్వెల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతవరకు క్లిక్ అవుతాయో చూడాలి.