అమెరికా డల్లాస్‌లో గేమ్ ఛేంజర్ గ్యాంగ్ హల్చల్
ఇక ఈ వేదికపై చరణ్ కూడా తన సినిమా పాటలకు హుషారుగా స్టెప్పులేస్తూ అభిమానులు అలరించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా గ్రాండ్ విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్టర్లు, సింగిల్స్ కి ఇప్పటికే అద్భుత స్పందన వచ్చింది. తాజాగా అమెరికా డల్లాస్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ భారీ అభిమానుల నడుమ ఘనంగా జరిగింది. రామ్ చరణ్‌కు డల్లాస్‌లో ఉరుములు మెరుపులతో కూడిన ఘనస్వాగతం లభించింది. గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ డల్లాస్ లో భారీ అభిమానుల నడుమ వైభవంగా సాగింది. అక్కడి నుంచి ఫోటోలు, వీడియోలు వెబ్ లో వైరల్ అవుతున్నాయి. వెన్యూ వద్దకు చరణ్ రాక కోసం ఎదురు చూస్తున్న భారీ అభిమానులతో ఆడిటోరియం హౌస్ ఫుల్ అయిన వీడియోలు బయటకు వచ్చాయి. గ్లోబల్ స్టార్ అంతర్జాతీయ అభిమానులు విజిల్స్ కేకలతో వెల్ కం చెప్పారు. ఇక ఈ వేదికపై చరణ్ కూడా తన సినిమా పాటలకు హుషారుగా స్టెప్పులేస్తూ అభిమానులు అలరించారు.
అమెరికా డల్లాస్‌లో జరిగిన ఈవెంట్లో దాదాపు 10వేల మంది అభిమానులు కార్యక్రమాన్ని వీక్షించారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, దిల్ రాజు, బుచ్చిబాబు సహా ఇతర చిత్రబృందం హాజరైంది. ఇంతకుముందు గేమ్ ఛేంజర్ టీజర్‌ను లక్నోలో లాంచ్ చేశారు. రామ్ చరణ్, కియారా అద్వానీ, దిల్ రాజు, దర్శకుడు శంకర్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. అలాగే రామ్ చరణ్ -కియారా అద్వానీ జంటపై ధోప్ సాంగ్ వీడియోను మేకర్స్ ఆవిష్కరించగా ఈ పాటలో చరణ్ గ్రేస్, స్టైలిష్ స్టెప్పులు అభిమానులను అలరించాయి.
RRR అద్భుతమైన విజయం సాధించిన తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా, దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ ని వెచ్చించి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రామ్ చరణ్ ని ఎంచుకోవడానికి కారణాన్ని శంకర్ ఇటీవలి ఈవెంట్లో వెల్లడించారు. రామ్ చరణ్ ఇందులో నటిస్తే బాగుంటుందని దిల్ రాజు భావించారని, తనకు కూడా సముచితంగా అనిపించిందని శంకర్ వెల్లడించారు. నా కథల్లో కొన్ని యూనివర్సల్ థీమ్‌లు పెద్ద హీరోలకు సరిగ్గా సరిపోతాయని కూడా శంకర్ అన్నారు. గేమ్ ఛేంజర్ 10 జనవరి 2025న విడుదల కానుంది.