పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న `భీమ్లా నాయక్` చిత్రీకరణ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఔటర్ లోని ఈ స్పాట్ షూటింగ్ లకు హబ్ లాంటింది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడానికి అనువైన స్థలం. తెలుగు సినిమాతో పాటు ఇతర భాషల సినిమాల షూటింగ్ లు సైతం ఇక్కడ తరుచూ జరుగుతుంటాయి. నిత్యం ఏదో ఒక సినిమా యాక్షన్ సన్నివేశాల చిత్రణ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంటుంది. యాధృచ్ఛికంగానే అయినా పవన్ -చిరు-నాగబాబు చిత్రాల షూటింగులు ఇక్కడ జరుగుతున్నాయి. మెగాస్టార్ `గాడ్ ఫాదర్` చిత్రీకరణ ఈ ఫ్యాక్టరీలో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి భీమ్లా నాయక్ సెట్స్ ని సందర్శించి...పవన్ కళ్యాణ్ తో ముచ్చటించిన సంగతి తెలిసిందే.
తాజాగా మలయాళం నటుడు.. కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న కొత్త సినిమా షూటింగ్ కూడా ఇదే స్పాట్ లో ప్లాన్ చేయడం ఉత్కంఠ పెంచుతోంది. పవన్ సినిమా షూటింగ్ విషయం తెలుసుకున్న మోహన్ లాల్ కూడా `భీమ్లా నాయక్` సెట్ ని సందర్శించారు. పవన్ కళ్యాణ్- మోహన్ లాల్ విరామ సమయంలో చాలా సేపు మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య ప్రధానంగా నేటి రాజకీయ అంశాలు చర్చకొచ్చినట్లు తెలిసింది. అలాగే జనసేన పార్టీ విశేషాల్ని కూడా మోహన్ లాల్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
అనూహ్యంగా ఇద్దరి మధ్య ఈ భేటీ జరిగింది. అనంతరం చిత్ర నిర్మాతలు ఇద్దరికి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసారు. అయితే ఈ విషయాలేవి బయటకు తెలియకూడదని..మీడియాకి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని పవన్ అదేశించినట్లు తెలిసింది. ఇది కేవలం క్యాజువల్ మీటింగ్ తప్ప అంతకు మించి ఎలాంటి విషయాలు చర్చించలేదని పీఆర్ టీమ్ కి వెల్లడించినట్లు సమాచారం. పవన్ ఆదేశాల నేపథ్యంలో మీడియాకి అధికారికంగా ఎలాంటి సమచారం ఇవ్వలేదు. అయితే ఆన్ సెట్స్ లో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు లీక్ అవ్వడమే గాక.. ఔత్సాహికుల ద్వారా ఈ సమాచారం బయటకు వచ్చింది. అలాగే మోహన్ లాల్ ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే లోపు మెగాస్టార్ చిరంజీవిని కూడా కలుస్తారని సమాచారం. ఇప్పటికే కలెక్షన్ కింగ్ మోహన్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఎయిటీస్ స్టార్లలో చిరంజీవి- మోహాన్ లాల్ ఎంతో క్లోజ్ అన్న సంగతి విధితమే.