కిలికి తర్వాత.. శ్రీకాకుళం యాస..

Update: 2016-04-21 04:50 GMT
బాహుబలి ది బిగినింగ్ లో విలన్ కాలకేయుడిగా ప్రభాకర్ మెప్పించిన తీరుకి సూపర్బ్ అనే మాట కూడా చిన్నదే. బాహుబలి తర్వాత తెగ బిజీ అయిపోయాడు ప్రభాకర్. తెలుగు - తమిళ్ - మలయాళమే కాదు.. బాలీవుడ్ సినిమాల నుంచి పిలుపు వచ్చింది.

అలా వచ్చిన ఆఫర్లన్నీ నెగిటివ్ రోల్స్ కావడంతో.. చాలావరకూ ఒప్పుకోలేదంటున్నాడు ప్రభాకర్. తనను తాను యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవడానికి పాజిటివ్ రోల్స్ కూడా చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అలాంటి సమయంలో ఎంఎస్ రాజు నుంచి ఓ పాత్ర చేయాలని పిలుపు వచ్చిందట. స్వతహాగా తెలంగాణ వ్యక్తి అయిన ప్రభాకర్.. ఈ మూవీలో శ్రీకాకుళం యాసలో మాట్లాడనుండడం విశేషం. అయితే.. కిలికి మాట్లాడినోడికి ఇదో లెక్కా.

ఎంఎస్ రాజు మూవీతో పాటు.. గోపీచంద్ నటిస్తున్న ఆక్సిజన్ - ఆవు పులి మధ్యలో ప్రభాస్ - మోహన్ లాల్ నటిస్తున్న ఓ మలయాళ చిత్రం కూడా ప్రభాకర్ చేస్తున్నాడు. ధనుష్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో మంచి కేరక్టర్ కి ఆఫర్ వచ్చినా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడట. ఓ హిందీ సినిమాని కూడా ఇదే రీజన్ తో వదిలేయాల్సి వచ్చిందని చెప్పాడు కాలకేయుడు అలియాస్ ప్రభాకర్.
Tags:    

Similar News