కాలకేయుడు కళ్ల నీళ్లు పెట్టుకున్న క్షణం

Update: 2016-06-04 12:47 GMT
బాహుబలిలో కాలకేయుడుగా ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే పాత్ర చేశాడు ప్రభాకర్. మర్యాదరామన్నతో గుర్తింపు వచ్చినా ఆ తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ తో వెనకబడ్డ ప్రభాకర్ కి.. రాజమౌళి మళ్లీ పిలిచి బాహుబలిలో ఛాన్స్ ఇచ్చాడు. ఆ మూవీ విజయం తర్వాత ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని చెబుతున్నాడు. ప్రస్తుతం సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతున్న రైట్ రైట్ చిత్రంలో.. ఓ డ్రైవర్ గా పాజిటివ్ రోల్ చేస్తున్నాడు ప్రభాకర్.

శ్రీకాకుళం యాసలో మాట్లాడే పాత్ర కావడంతో ఈ కేరక్టర్ కోసం బాగానే హోమ్ వర్క్ చేశాడట ప్రభాకర్. అలాగే గతంలో పరిచయం లేకపోయినా.. హీరో సుమంత్ అశ్విన్ తో బాగా కలిసిపోయానని చెబుతున్నాడు. ఈ మూవీ డైరెక్టర్ మనుతో కలిసి గతంలో కో డైరెక్టర్ గా పని చేసి ఉండడంతో.. ఇద్దరి మధ్య మంచి అటాచ్మెంట్ ఉందన్న ప్రభాకర్.. వరుసగా విలన్ రోల్స్ చేయాల్సి వచ్చినపుడు మాత్రం బాగా బాధ పడ్డాడట. అందుకే ఇప్పుడు పాజిటివ్ రోల్ చేసే ఆఫర్ రావడంతో చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు.

బాహుబలితో ప్రభాకర్ కి ఇంటర్నేషనల్ రేంజ్ లో గుర్తింపు వచ్చింది. గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో చాలామంది విదేశీయులు.. తన దగ్గరకు వచ్చి కాలకేయుడిగా బాగా నటించావని చెప్పడంతో కళ్లలో నీళ్లు తిరిగేశాయని అన్నాడు. రైట్ రైట్ కాకుండా.. గోపీచంద్ మూవీ ఆక్సిజన్ - ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి, కాలకేయ వర్సెస్ కాట్రవల్లి చిత్రాలతో పాటు.. మలయాళంలో మోహన్ లాల్ సినిమాలోను, కన్నడంలో మూడు చిత్రాల్లోనూ నటిస్తూ మంచి స్పీడ్ చూపించేస్తున్నాడు కాలకేయుడు అలియాస్ ప్రభాకర్.
Tags:    

Similar News