'డార్లింగ్' ప్రభాస్ తన కెరీర్లో 20వ చిత్రాన్ని 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పీరియాడికల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్నారు. 'సాహో' తరువాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి.
కాగా ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్ విషయంలో జాప్యం జరుగుతూ వస్తోంది. యంగ్ రెబల్ స్టార్ లేటెస్ట్ మూవీ అప్డేట్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇంతవరకు ఫస్ట్ లుక్ కానీ టైటిల్ కూడా రివీల్ చేయకపోవడంతో ప్రభాస్ అభిమానుల్లో అసహనం నెలకొంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రొడక్షన్ హౌస్ మీద నెగిటివ్ ట్రెండ్స్ క్రియేట్ చేసి వారి అసహనాన్ని వెల్లడించారు. అయితే ఎట్టకేలకు 'ప్రభాస్ 20' కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.
ఇన్నాళ్ళుగా వేచిన తరుణం రెండు రోజులలో రాబోతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు. జూలై 10న ఉదయం 10 గంటలకు 'ప్రభాస్ 20' ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ తమిళ్ మలయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ లో వెల్లడించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా డార్లింగ్ ఫ్యాన్స్ సందడి స్టార్ట్ చేశారు. ఫైనల్ గా ప్రభాస్ మూవీ అప్డేట్ రాబోతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా పాన్ ఇండియా మూవీగా భారీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పలువురు ఇతర ఇండస్ట్రీ నటులు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారట. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జార్జియా షెడ్యూల్ లో ఉన్నప్పుడు కరోనా మహమ్మారి ఆటంకం కలిగించడంతో ఇండియాకి వచ్చింది. ఇక పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ మిగతా భాగం షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు.