శర్వానంద్ కాస్త గ్యాప్ తీసుకుని ప్రేక్షకుల ముందుకు ఒకే ఒక్క జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అక్కినేని అమల ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. వరుసగా ఫ్లాప్ లు చవి చూస్తున్న శర్వానంద్ ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నట్లుగా ఇటీవల ఇంటర్వ్యూలు చూస్తే అర్థం అవుతోంది.
సెప్టెంబర్ 9వ తారీకున విడుదల కాబోతున్న ఈ టైమ్ ట్రావెల్ మూవీ ప్రత్యేక షో లతో జనాల్లోకి తీసుకు వెళ్లాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. సాదారణంగా ఈ మధ్య కాలంలో ప్రీమియర్ షో లను కూడా వేసేందుకు నిర్మాతలు భయపడుతున్నారు. అలాంటిది ఈ సినిమా ను విడుదలకు ముందే మూడు రోజుల పాటు ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించారట.
అందులో ఒక ప్రీమియర్ షో ను ప్రత్యేకంగా రామ్ చరణ్ మరియు ప్రభాస్ కోసం వేయబోతున్నారట. శర్వానంద్ కు రామ్ చరణ్ బాల్య మిత్రుడు అనే విషయం తెల్సిందే. అంతే కాకుండా ప్రభాస్ తో కూడా శర్వా కి మంచి స్నేహ సంబంధం ఉంది. అందుకే వారిద్దరు ఈ సినిమా ప్రీమియర్ కి వచ్చేందుకు ఓకే చెప్పారని సమాచారం అందుతోంది.
సినిమా పై చాలా నమ్మకంతో ఉన్న యూనిట్ సభ్యులు ఇలా ఇండస్ట్రీలోని వివిధ వర్గాల వారికోసం ప్రీమియర్ లను ప్లాన్ చేశారు. సినిమా విడుదలకు ముందే టాక్ వచ్చే అవకాశం ఉంది. సినిమా ఫలితం విడుదలకు ముందే తేలిపోయే అవకాశం ఉంది.. అయినా కూడా ప్రీమియర్ షో లను వేసి జనాల్లోకి మరింతగా సినిమా ను తీసుకు వెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారట.