ఫారిన్లో జాతకాలు చూడనున్న ప్రభాస్‌

Update: 2016-08-03 04:59 GMT
ఇప్పటికే బాహుబలి వంటి పెద్ద సినిమాను చేశాక ఇంకా జాతకాలు చూసుకోవడం ఏంటండీ బాబూ? పోనివ్ తనకు ఎటువంటి లైఫ్‌ పార్టనర్ రాబోతుంది.. ఎప్పుడు వస్తుంది.. అసలు పెళ్ళెప్పుడు అవుతుంది అని తెలుసుకోవడానికి మనోడు జాతకాలు చూపిస్తున్నాడా? అబ్బే అదంతా కాదు. మనోడు స్వయంగా తనే జాతకాలు చెప్పనున్నాడు. అదే స్పెషాలిటీ.

ఆల్రెడీ చెప్పుకున్నట్లు.. బాహుబలి 2 షూటింగ్ పూర్తవ్వగానే.. సుజిత్ డైరక్షన్లో ఒక సినిమా.. దాని తరువాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు ప్రభాస్‌. అయితే ఈ రెండో సినిమాలో.. మనోడు పూర్తిస్థాయి యురోప్ లో జరిగే ప్రేమకథ చేస్తాడని తెలిసిందే. మరికొంచెం డిటైల్స్ లోకి వెళితే.. ఈ సినిమాలో ప్రభాస్ ఒక టారాట్ రీడర్ పాత్ర చేస్తున్నాడట. అలాగే ఫేస్ చూసి.. చేతిని చూసి.. జాతకం చెప్పేసి హస్త సాముద్రికల ఎక్సపర్టుగా కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇలాంటి వ్యక్తికి ఒక అమ్మాయితో ప్రేమ.. దానిలో ఉండే మలుపులు.. అబ్బో ఆ కథే వేరు అంటున్నాడు దర్శకుడు రాధాకృష్ణ.

ఈ సినిమా పట్టాలెక్కేది ఎప్పుడో తెలియదు కాని.. దీని గురించి మాత్రం రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తుంటే.. ప్రభాస్‌ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మొత్తానికి బాహుబలి 2 పూర్తయ్యాక మనోడు చేయబోయే సినిమాలు చాలా వెరైటీగా ఉండే కమర్షియల్ మూవీస్ అనమాట.
Tags:    

Similar News