సాహోని మించేలా థ్రిల్లింగ్ థీమ్!

Update: 2018-10-29 06:30 GMT
బాహుబలి విజయంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డార్లింగ్ ప్రభాస్ ఎన్నడూ లేనిది ఒకేసారి రెండు షూటింగ్స్ లో పాల్గొంటూ యమా బిజీగా ఉన్నాడు. సాహో ఒకపక్క జరుగునుండగానే ఇటీవలే జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ కు కొబ్బరికాయ కొట్టించిన ప్రభాస్ ఇప్పుడు ఇటలీలో దాని పని మీదే ఉన్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అమౌర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అంటే ఫ్రెంచ్ లో ప్రేమ బంధం అన్న మాట.

1970నాటి నేపథ్యంలో ప్రభాస్ ఇందులో చేయి చూసి జాతకాలు చెప్పేవాడికి కనిపిస్తాడని టాక్. దానికి వర్తమానానికి లింక్ పెడుతూ సరికొత్త తరహాలో ప్రభాస్ ని ప్రెజెంట్ చేయబోతున్నట్టు తెలిసింది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఇప్పటికే అక్కడ అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించే ఓ పల్లెటూరి సెట్ ని రూపొందించే పనిలో ఉన్నాడట. భాగమతికి చేసిన వర్క్ కు అచ్చెరువొందిన నిర్మాతలు ఈ బాధ్యతను కూడా అతనికే అప్పగించారు. ఇదే కాదు పెదనాన్న కృష్ణంరాజు కూడా ఇందులో ఓ కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ ఇద్దరు కలిసి గతంలో రెబెల్ లో తండ్రి కొడుకులుగా నటించారు. ఆ తర్వాత మళ్ళి ఈ కాంబో కుదరలేదు.రెండు కాలాలకు సంబంధించిన ప్రేమ కథ లైన్ చాలా ఇంటరెస్టింగ్ గా అనిపిస్తోంది.

 మరి పునర్జన్మ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందా లేక రెండు వేర్వేరు కథలుగా చూపించి ఏమైనా ట్విస్ట్ ఇస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సాహోతో పాటు ఇది కూడా పారలల్ గా జరిగేలా యువి సంస్థ ప్లానింగ్ లో ఉంది. 2020  విడుదల టార్గెట్ చేసుకున్న రాధాకృష్ణ మూవీ బడ్జెట్ విషయంలో రాజీ పడటం లేదట. సాహు తర్వాత వచ్చే మూవీ కాబట్టి అప్పటికి అంచనాలు ఎన్నో రేట్లు పెరిగిపోతాయి. అందుకే దీనికి సైతం వంద కోట్ల దాకా బడ్జెట్ కేటాయించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎయిర్ టెల్ యాడ్స్ ద్వారా పాపులర్ అయిన మోడల్ సాషా చెట్రి సెకండ్ హీరోయిన్ గా చేస్తున్నట్టు టాక్. మరికొన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది
Tags:    

Similar News