బాహుబలి ప్రాజెక్టు కోసం చాలామంది కొన్నేళ్ల నుంచి కష్టపడుతున్నారు. దర్శకుడు రాజమౌళి నుంచి టెక్నీషియన్స్ చాలామందే ఈ కష్టంలో భాగం అయినా.. బాహుబలి తప్ప మరే ప్రాజెక్టు.. ధ్యాస లేకుండా సినిమాలో నిమగ్నమైపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇన్నేళ్లు ఓ హీరో ఓ ప్రాజెక్టు కోసం అంకితం అయిపోవడం.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇదే మొదలు.. బహుశా ఇదే ఆఖరు కూడా కావచ్చేమో. ఇప్పుడు బాహుబలి నుంచి ప్రభాస్ కి స్వేచ్ఛ లభించే రోజుపై క్లారిటీ వచ్చేసింది.
ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్ కి సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రధానమైన సన్నివేశాల చిత్రీకరణ మొత్తం పూర్తయిపోయిందట. ఇక మిగిలిన చిన్నపాటి పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలుస్తోంది. వీటిని పూర్తి చేసేందుకు కూడా డెడ్ లైన్ ఫిక్స్ చేసేసి అనౌన్స్ చేసేశాడట జక్కన్న. డిసెంబర్ 27తో బాహుబలి షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిపోతుందని చెప్పేయడంతో.. ప్రభాస్ సహా బాహుబలి మూవీకి అంకితం అయిపోయిన వారికి.. ఆ రోజుతో స్వేచ్ఛ లభించనుంది.
అయితే.. బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ పూర్తయిందంటూ గుమ్మడికాయ కొట్టే డేట్ మాత్రం డిసెంబర్ 31నే అని చెబుతున్నారు. ఇక రిలీజ్ విషయానికి వస్తే ఏప్రిల్ 28.. 2017న ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో ఒకేసారి గ్రాండ్ రిలీజ్ కి సర్వం సకలం సిద్ధం చేసుకుంటోంది బాహుబలి ది కంక్లూజన్.