డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. బాహుబలి - సాహో చిత్రాలతో హిందీ మార్కెట్లోనూ పాగా వేశాడు. ప్రభాస్ నటించే ఏ సినిమా అయినా పాన్ ఇండియన్ కేటగిరీలోనే రిలీజవుతున్నాయి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి.
ఓంరౌత్ తో ఆదిపురుష్ 3డి స్ట్రెయిట్ హిందీ సినిమా. తెలుగు-తమిళం సహా దక్షిణాదిన అనువాద వెర్షన్లు రిలీజవుతాయి. టీసిరీస్ భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ప్రభాస్ అత్యంత భారీ పారితోషికం అందుకోనున్నాడని టాక్ వినిపిస్తోంది. హిందీ మీడియాలో అయితే ఏకంగా ప్రభాస్ ఈ చిత్రం కోసం 100 కోట్లు అందుకుంటున్నాడన్న ప్రచారం సాగిపోతోంది.
ఇదిలా ఉంటే.. తాను నటించే ప్రతి సినిమాలోనూ ముంబై నేపథ్యం తప్పనిసరి చేస్తున్నాడు ప్రభాస్. ముంబై పరిసరాలు అక్కడ లొకేషన్లలోనే తన సినిమాల్ని తెరకెక్కించేందుకు పకడ్భందీ ప్లాన్ తో ఉన్నాడట. ఆదిపురుష్ 3డిని కూడా అక్కడ కొన్ని స్టూడియోల్లో తెరకెక్కిస్తున్నారు. దానికోసం కొన్ని నెలల పాటు ముంబైలోనే ఉండాల్సి ఉంటుందని.. ఆ క్రమంలోనే అక్కడా ఒక సొంత ఇల్లు ఉంటే బావుంటుందని భావిస్తున్నాడట. ముంబైలోని సెలబ్రిటీలు ఉండే చోట ఒక కాస్ట్ లీ భవంతిని కొనేయాలన్న ప్లాన్ తో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇల్లు కొనేందుకు ఆదిపురుష్ 3డి నిర్మాతలే సాయం చేస్తున్నారని చెబుతున్నారు. ఇక తనకు వచ్చే పారితోషికాన్ని ప్రభాస్ అక్కడే పెట్టుబడి పెట్టేస్తున్నాడంటూ తెలుగు మీడియాల్లోనూ వేడిగా గాసిప్ షికార్ చేస్తోంది. ముంబై బాంద్రా.. కుర్లా అంథేరి వంటి చోట్ల ఇల్లు కొనాలంటే 50-80కోట్లు సుమారుగా పెట్టాల్సి ఉంటుంది. చూస్తుంటే అంత పెద్ద మొత్తం ప్రభాస్ అక్కడ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందేమో! అయితే డార్లింగ్ ఈ విషయాన్ని అధికారికంగా చెప్పేవరకూ ఏదీ కన్ఫామ్ చేయలేం.
ఎలాగూ ఒక పెట్టుబడిగా కూడా ఉంటుందన్న ఉద్దేశంతో ముంబయిలోని ఖరీదైన ప్రాంతంలో పెద్ద ఇల్లు కొనుక్కోవాలని ప్రభాస్ చూస్తున్నట్లు సమాచారం. పదుల కోట్ల మొత్తంలోనే ఇందుకోసం పెట్టుబడి పెడుతున్నాడట. బహుశా ఆదిపురుష్ సినిమాకు వచ్చే పారితోషకమంతా ఇంటి మీదే పెట్టేస్తున్నాడేమో ప్రభాస్.