రెబల్ స్టార్ ప్రభాస్ `ఆదిపురుష్` చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా టీ సిరీస్ అత్యంత ప్రతిష్టాత్మంగా 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఆన్ సెట్స్ చిత్రీకరణ సాగుతోంది. 2022 లో ఈ మూవీని పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ చేయనున్నారు. `బాహుబలి`, `సాహో` చిత్రాలతో భారతదేశంలో ఛాలెంజింగ్ హీరోగా సత్తా చాటిన ప్రభాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా డార్లింగ్ బాలీవుడ్ లో రెండవ చిత్రాన్ని కూడా ఫైనల్ చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రభాస్ 24వ చిత్రం హిందీలోనే అంటూ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రానికి వార్ ఫేం సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని సోషల్ మీడియాల్లో ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుందని కథనాలు వైరల్ అవుతున్నాయి.
దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ కు భారీ పారితోషికం చెల్లించనున్నారని.. అడ్వాన్స్ గా ఇప్పటికే కొంత మొత్తం చెల్లించారని కూడా టాక్ నడుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత? అన్నది నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటిస్తే గాని క్లారిటీ రాదు. ఇక సిద్ధార్థ్ గతంలో `బ్యాంగ్ బ్యాంగ్`- `వార్` లాంటి చిత్రాల్ని తెరకెక్కించారు. రెండు భారీ యాక్షన్ ఎంటర్ టైనర్లే. ఇప్పుడు ప్రభాస్ కోసం మరో లెవల్లో ఉండే స్క్రిప్ట్ ని ఎంపిక చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సలార్ చిత్రంతో ఇప్పటికే సంచలనాలకు సిద్ధమవుతున్న ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీకి కమిటైనట్టేనని అతడిని వార్ దర్శకుడు మరో రేంజులో చూపిస్తాడని కూడా అంచనాలు ఊపందుకున్నాయి. ఇది వార్ చిత్రానికి సీక్వెల్ కథాంశంతో తెరకెక్కిస్తారా లేక ఫ్రెష్ గా సరికొత్త ఫ్రాంఛైజీని ప్రారంభిస్తారా? అన్న దానిపైనా మునుముందు మరింత క్లారిటీ రావాల్సి ఉంటుంది.
ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అతడు నటించిన రాధేశ్యామ్ రిలీజ్ కి రెడీ అవుతుండగా.. మరో మూడు భారీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తో సలార్ .. ఓంరౌత్ తో ఆదిపురుష్ 3డి శరవేగంగా పూర్తవుతున్నాయి. తదుపరి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించే భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం సెట్స్ పైకి వెళుతుంది. ఈ సినిమా తర్వాత వార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు ఆస్కారం ఉంది. ఇదే గాక యష్ రాజ్ సంస్థ నిర్మించే ధూమ్ 4 కోసం ప్రభాస్ ని సంప్రదించారని ఇంతకుముందు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి మరో ఐదారేళ్ల పాటు ఇండియా లెవల్లో రిలీజయ్యే అతి భారీ చిత్రాల్లో మాత్రమే నటిస్తారు. ఇక ప్రాంతీయంగా అతడు సినిమాలు చేసేందుకు ఆస్కారం లేదని అర్థమవుతోంది.
డార్లింగ్ సెలెక్షన్ యూనిక్:
ఓవైపు భారీ మాస్ యాక్షన్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు పురాణేతిహాసాల నుంచి ఎంపిక చేసిన కథలతో 3డి ప్రయోగం చేస్తున్నాడు. అలాగే ఐరోబో తరహాలో భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటించేందుకు అతడు ప్లాన్ చేస్తుండడం సర్వత్రా అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రభాస్ మునుపటితో పోలిస్తే స్క్రిప్ట్ సెలెక్షన్ పరంగానూ ఎంతో పరిణతి కనబరుస్తున్నారు. ఒకదానితో ఇంకొకటి సంబంధం లేకుండా యూనిక్ కాన్సెప్టులను ఎంచుకోవడం ఆసక్తిని పెంచుతోంది.