భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన *బాహుబలి* సిరీస్ చిత్రాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజి ఎక్కడికో వెళ్లిపోయింది. బాలీవుడ్ అతడికి ఇప్పుడు రెడ్ కార్పెట్ పరిచేస్తోంది. అయితే తనకు ఇంత కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన టాలీవుడ్‌ను వీడేందుకు అతడు ససేమిరా అంటున్నాడు. మరోవైపు ముదురు బెండకాయ కాకముందే బాహుబలి పెళ్లి జరిగితే బాగుంటుందని కూడా అతడి అభిమానులు కొరుకుంటున్నారు.
బాహుబలి రెండు చిత్రాలతో పాటు అంతకు మరో రెండు చిత్రాల్లో అతడితో కలిసి నటించిన బొద్దుగుమ్మ అనుష్కతో ప్రభాస్ పెళ్లి ఫిక్సయించదని, త్వరలోనే వారిద్దరూ ఒక్కటి కానున్నారన్న వార్తలు కూడా మొన్నామధ్య షికారు చేశాయి. అయితే వెనువెంటనే వాటికి తెరపెట్టేందుకు సిద్ధమైన అనుష్క అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పేసింది. అయితే ప్రభాస్ మాత్రం ఇప్పటిదాకా తన పెళ్లిపై గానీ, తన పెళ్లిపై, అనుష్కతో తన పెళ్లిపై జరుగుతున్న ప్రచారంపై ఇప్పటిదాకా స్పందించిన దాఖలా కనిపించలేదు. అయితే ఎంతో కాలం అతడు ఇలా నోరు కట్టుకుని ఉండలేడు కదా.
అందుకేనేమో ప్రభాస్ తన పెళ్లి గురించి తొలిసారిగా నోరు విప్పాడు. ఒక హీరో... ఒక హీరోయిన్ వరుసగా రెండు, మూడు సినిమాలు చేస్తే ఇలాంటి రూమర్లు రావడం సహజమేనని ప్రభాస్ తెలిపాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా హల్ చల్ చేసే ఇలాంటి పుకార్లు మొదట్లో తనకి ఇబ్బంది కలిగించేవనీ, ఆ తరువాత వాటిని గురించి పట్టించుకోవడం మానేశానని చెప్పాడు. ఇక తన ఇంట్లో పెళ్లికి సంబంధించిన ముచ్చట్లు జోరందుకున్నాయనీ, త్వరలోనే పెళ్లి జరగవచ్చనే వార్తల్లోనూ నిజం లేదని కుండబద్దలు కొట్టేశాడు. ప్రస్తుతం తన దృష్టి 'సాహో' సినిమాపైనే ఉందనీ, ఆ సినిమా పూర్తయిన తరువాత పెళ్లి గురించి ఆలోచిస్తానని అతడు చెప్పుకొచ్చాడు.