పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న `జాన్` షూటింగ్ డైలమా గురించి తెలిసిందే. కొంత షూటింగ్ చేసి తిరిగి దానిని పక్కన పెట్టి అటుపై స్క్రిప్టు ను మార్చి ఇటీవలే షూటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో భారీ సెట్స్ లో ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ సహా ఇతర కీలక తారలంతా షూటింగ్ లో పాల్గొంటున్నారు. పీరియాడిక్ లవ్ స్టోరీ ని విజువల్ గాను అద్భుతంగా ఆవిష్కరించేందుకు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ సీరియస్ గా వర్క్ చేస్తున్నారట. 2019 పాన్ ఇండియా సినిమా సాహో రిజల్ట్ రిపీట్ కాకుండా ఆయన చాలా జాగ్రత్తపడుతున్నారట.
తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ నటించిన గత పాన్ ఇండియా సినిమాల తరహా లోనే జాన్ వాయిదా పడింది. బాహుబలి.. సాహో తరహాలోనే రిలీజ్ వాయిదా తప్ప లేదు. ఇప్పటికే అనుకున్న సమయానికి జాన్ చిత్రీకరణ పూర్తయ్యే ఛాన్సే లేదని .. అందుకే ఈ సినిమా 2020 వేసవిలో రిలీజ్ చేయాలని నిర్ణయించామని చిత్రనిర్మాతల్లో ఒకరైన కృష్ణంరాజు మొన్న బర్త్ డే పార్టీలో ప్రకటించారు.
అంటే ఈ ఏడాదంతా జాన్ సెట్స్ లోనే ఉంటుంది. 2021 జనవరి నాటికి కూడా రెడీ కాదు. కేవలం సమ్మర్ కానుకగా..2021 ఏప్రిల్ 28న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. సరిగ్గా ఇదే తేదీకి 2017లో బాహుబలి రిలీజైంది. దీంతో ఇది సెంటిమెంటా? లేక షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్లనే ఇలా తేదీ మార్చారా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. జాన్ లో ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓ కీలక పాత్రలో నటిస్తూ.. యూవీ సంస్థతో నిర్మాణభాగస్వామిగా వ్యవరిస్తున్నారు. స్క్రిప్టు మార్పు అనంతరం కృష్ణంరాజు కోసం ఓ పాత్రను క్రియేట్ చేశారని తెలుస్తోంది.