ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' ఆగష్టు 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 18 వ తేదీ సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో భారీ స్థాయిలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ రీసెంట్ గా బాలీవుడ్ మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలలో ప్రభాస్ ను చాలా అంశాలపై ప్రశ్నలు అడిగారు. మ్యారేజ్ దగ్గర నుంచి.. సాహో బడ్జెట్ వరకూ వారి ప్రశ్నల్లో అన్ని అంశాలు కవర్ అయ్యాయి.
ఈ ఇంటర్వ్యూలలో రాజమౌళి గురించి కూడా ఒక ప్రశ్నను అడిగారు. గతంలో రాజమౌళి కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్నపుడు "నార్త్ సూపర్ స్టార్లతో పోలిస్తే సౌత్ సూపర్ స్టార్ లు తమ అభిమానులకు ఏం కావాలనే విషయం గ్రహించడంలో ముందున్నారు" అని కామెంట్ చేయడం జరిగింది. అప్పట్లో ఆ కామెంట్ పై బాలీవుడ్ మీడియాలో జోరుగా చర్చలు కూడా సాగాయి. రాజమౌళి చేసిన ఆ కామెంట్ పై మీ అభిప్రాయం ఏంటని ప్రభాస్ ను అడిగితే "కాదు.. ఆ విషయంలో రాజమౌళి అభిప్రాయం సరైనదని నేను అనుకోను" అంటూ బదులిచ్చాడు. "వారు సూపర్ స్టార్స్ అయినప్పుడు ఆ విషయం తెలియకుండా ఎలా ఉంటుంది" అంటూ తన అభిప్రాయం వెల్లడించాడు.
ఒక్కో విషయంలో ఒక్కొకరి అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు సహజమే. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రభాస్ ను ఎంత క్లిష్టమైన ప్రశ్న వేసినా స్మూత్ గా సాఫ్ట్ గా జవాబు చెప్పి వివాదం రేగకుండా తప్పించుకుంటున్నాడు. అదే ప్రశ్నకు కనుక అవును "బాలీవుడ్ స్టార్లు ఫ్యాన్స్ కు ఏం కావాలో తెలుసుకోలేక పోతున్నారు" అని ఉంటే నార్త్ ఆడియన్స్ అప్సెట్ అయ్యే ప్రమాదం ఉంది. అలాంటి ఇబ్బంది లేకుండా లౌక్యంగా సమాధానం చెప్పి అక్కడే దానికి ఫుల్ స్టాప్ పెట్టాడు.