ప్ర‌భాస్‌ కి అక్క‌డ డిమాండ్ పెరిగింది!

Update: 2015-08-10 22:52 GMT
అల్లు అర్జున్ త‌న మార్కెట్‌ ని మ‌ల‌యాళంకి ఎప్పుడో విస్త‌రించాడు. అది చూసి చాలా మంది యువ క‌థానాయ‌కులు త‌మ సినిమాల్ని కూడా అలా ఇత‌ర భాష‌ల‌కి పంపించాల‌ని ప్ర‌ణాళిక‌లు వేసుకొంటున్నారు. రామ్‌ చ‌ర‌ణ్ `మ‌గ‌ధీర‌`తో మ‌ల‌యాళంలో సంద‌డి చేశాడు. ఆ చిత్రం అక్క‌డ మంచి వ‌సూళ్లే రాబ‌ట్టుకొంది. వాళ్లిద్ద‌రి త‌ర్వాత ఇప్పుడు ప్ర‌భాస్ కూడా అక్క‌డ ప్ర‌భావం చూపుతున్నాడు. `బాహుబ‌లి`ని చూశాక ప్ర‌భాస్‌ కి మ‌ల‌యాళంలో  భారీగా అభిమానులు ఏర్ప‌డ్డారు.

 స్ట్రెయిట్ సినిమాకి ధీటుగా అక్క‌డ `బాహుబ‌లి ఆడింది. దీంతో మ‌ల‌యాళ ప్రేక్ష‌కులు ప్ర‌భాస్ ప్ర‌భాస్ అని క‌ల‌వ‌రిస్తున్నారు. వాళ్ల అభిమానాన్ని చూసి అక్క‌డి మార్కెట్ వ‌ర్గాలు ప్ర‌భాస్ పాత సినిమాలేవైనా ఉన్నాయా? అంటూ ఇటీవ‌ల హైద‌రాబాద్‌ కి వ‌చ్చార‌ట‌. వాళ్లు `మిర్చి` సినిమాని చూసి మ‌ల‌యాళంలో డ‌బ్ చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలిసింది. ఇటీవ‌ల నిర్మాత‌ల‌తో ఆ లావాదేవీలు కూడా మాట్లాడుకొన్నార‌ని స‌మాచారం.

మొన్న‌టిదాకా అల్లు అర్జున్ హ‌వానే కొన‌సాగిన మ‌ల‌యాళం మార్కెట్‌ లో ప్ర‌భాస్ కూడా గ‌ట్టిగానే పాతుకుపోయేలా క‌నిపిస్తున్నాడు. ఆయ‌న‌కి బాహుబ‌లి తో ఒక్క మల‌యాళమే కాదు.. త‌మిళం, హిందీ భాష‌ల్లో నూ మంచి గుర్తింపు వ‌చ్చింది. అయితే ప్ర‌భాస్ దృష్టిలో మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ లేదు కానీ... తాను న‌టించే ప్ర‌తీ సినిమా తెలుగు, త‌మిళంలో రూపుదిద్దుకోవాల‌ని మాత్రం ఆశ‌ప‌డుతున్నాడు. అందుకే త‌దుప‌రి రెండు చోట్లా గుర్తింపు ఉన్న లింగుస్వామి, మురుగ‌దాస్‌ లాంటి ద‌ర్శ‌కుల‌తో ప్ర‌భాస్ సినిమాలు చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం హాలీడేస్‌ ని ఎంజాయ్ చేస్తున్న ప్ర‌భాస్ వ‌చ్చే నెల‌లో `బాహుబ‌లి2` కోసం రంగంలోకి దిగ‌బోతున్నాడు.
Tags:    

Similar News