అభిమానం ఈ మధ్య వెర్రితలలు వేస్తోంది. నచ్చిన హీరో అప్ డేట్ కోసం మేకర్స్ తో పాటు డైరెక్టర్లని, హీరోలని కూడా సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు మాటల యుద్ధానికి దిగి రచ్చ చేసిన విషయం తెలిసిందే. ట్రిపుల్ ఆర్ రిలీజ్ తరువాత మా హీరోని తక్కువ చేశారంటే మా హీరోని తక్కువ చేశారని, లేదా మా హీరోకు ప్రాధాన్యత నిచ్చారంటే తేదు మా హీరోకే అధిక ప్రాధాన్యత నిచ్చారంటూ అభిమానులు సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఇక 'రాధేశ్యామ్' రిలీజ్ టైమ్ లో అప్ డేట్స్ ఇవ్వడం లేదంటూ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తో సహ మేకర్స్ యువీ క్రియేషన్స్ ని ట్విట్టర్ వేదికగా ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అప్ డేట్స్ ఇవ్వడంలేదని, ప్రమోషన్స్ ప్రాపర్‌గా చేయడం లేదని ఇలా నానా రకాలుగా 'రాధేశ్యామ్' డైరెక్టర్ ని, మేకర్స్ ని తీవ్ర ఇబ్బందుకు గురిచేశారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి సూసైడ్ లెటర్లతో బెదిరింపులకు దిగుతుండటం సంచలనంగా మారింది.
ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్ ఒకరు ఏకంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కు సూసైడ్ లెటర్ ని పోస్ట్ చేయడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. 'ఆది పురుష్' షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇక నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ప్రాజెక్ట్ కె' చిత్రీకరణ దశలో వుంది. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ 'సలార్' మూవీలో నటిస్తున్నారు.
కేజీఎఫ్ 2 తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా ఆ మూవీని నిర్మించిన హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఈ మూవీని ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కరోనా కారణంగా ప్లాన్ మారి 'కేజీఎఫ్ 2' అదే ప్లేస్ లోరిలీజ్ కావడం, 'సలార్' షూటింగ్ ఆలస్యం కావడం తెలిసిందే.
అయితే ఇంత వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ని మేకర్స్ రిలీజ్ చేయడం లేదు. దీంతో హర్ట్ అయిన ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఏకంగా ఈ మూవీ అప్ డేట్ కోసం దర్శకుడిగా సూసైడ్ లెటర్ రాయడం సంచలనం గా మారింది. మే నెలలో ఈ సినిమా నుంచి లప్ డేట్ వస్తుందని ప్రచారం జరిగింది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి వివరణ లేకపోవడంతో అభిమాని సూసైడ్ లెటర్ ని సోసల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. సలార్ కు సంబంధించిన గ్లింప్స్ ని మే నెలలో విడుదల చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు.
దీనిపై హైదరాబాద్ పోలీసులు రియాక్ట్ అయ్యారు. సదరు అభిమాని డిటైల్స్ పంపించండి అంటూ కోరుతున్నారు. ఇక సదరు అభిమాని ట్వీట్ ని చూసిన చాలా మంది అభిమానులు ఇదేం పిచ్చిరా నాయనా? .. నువ్వు చస్తే నీ ఫ్యామిలీకే నష్టం కానీ ఇక్కడ ఎవరికీ ఏమీ కాదు.. పిచ్చి పనులు మానుకో అంటూ కామెంట్ లు చేస్తున్నారు. దీనిపై మాత్రం మేకర్స్ ఇంత వరకు స్పందించలేదు.