అభిమానం హద్దులు దాటే చోట పరిస్థితులు ఎలా ఉంటాయో అమలాపురం పట్టణాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఊళ్లో సినీ అభిమానులు ఉన్నా.. మిగిలిన చోట్లతో పోలిస్తే.. గోదావరి జిల్లాల్లో అభిమానుల తీరే వేరుగా ఉంటుంది. ఇక్కడి అభిమానులు తమ అభిమానాన్ని వ్యక్తిగత స్థాయిలోకి తీసుకుంటారు. తమ అభిమాన కథానాయకుడి కోసం ఎంతకైనా అన్నట్లుగా సాగుతూ ఉంటుంది. ఇలా ఉండే గోదావరి జిల్లాలో అమలాపురం మరో అడుగు ముందు ఉంటుంది.
తమ అభిమానంతో అభిమానులు హద్దులు దాటేస్తుంటారు. మోస్ట్ ఎవైటింగ్ మూవీ బాహుబలి విడుదల సందర్భంగా అమలాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం రాత్రి వేళ చోటు చేసుకున్న పరిణామాలతో అమలాపురం పట్టణం చిగురుటాకులా వణికిపోయింది. ఎప్పుడేం జరుగుతుందో ఏ మాత్రం అర్థం కాని పరిస్థితి చోటు చేసుకుంది. రూల్స్‌కు భిన్నంగా బాహుబలి సినిమాను ముందే ప్రదర్శిస్తున్నారంటూ పలు అభిమాన సంఘాల వారు థియేటర్ల దగ్గర ఆందోళన చేయటం.. సినిమా ప్రదర్శనను అర్థరాత్రి ఒంటిగంట తర్వాతే చేపట్టాలని.. లేదంటే తామే అడ్డుకుంటామని పలువురు హీరోల అభిమానులు రంగంలోకి దిగారు.
దీంతో.. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సినిమా ప్రదర్శనను అడ్డుకునేందుకు పలువురు హీరోల అభిమానులు రంగంలోకి దిగటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. అభిమానుల్ని కంట్రోల్ చేయటం కోసం పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. థియేటర్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు యువకులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మోటారు సైకిళ్లపై ర్యాలీగా డీఎస్పీ.. ఆర్డీవో కార్యాలయాల వద్దకు వెళ్లి తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో.. ప్రభాస్ అభిమానులకు.. ఇతర హీరోల అభిమానులకు మధ్య ఘర్షణపూరిత వాతావరణంతో ఎప్పుడెలాంటి పరిస్థితి చోటు చేసుకుంటుందో అర్థం కాని పరిస్థితి. తీవ్ర ఉద్రిక్తత మధ్య గురువారం అర్థరాత్రి దాటే వరకూ అమలాపురం సిటీ వణికిన పరిస్థితి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/