టాలీవుడ్ హీరోల అభిమానులు చేస్తున్న పనులు కొన్ని సార్లు చిరాకు తెప్పిస్తున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోల అభిమానులు పోటీ పడి మరీ సేవా కార్యక్రమాలు చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం హీరోల అభిమానులు ఇతర హీరోలను విమర్శించడం.. రచ్చ రచ్చ చేయడంపైనే దృష్టి పెడుతున్నారు.
ఇటీవల ఒక స్టార్ హీరో సినిమా రీ రిలీజ్ సందర్భంగా థియేటర్ లో జరిగిన హంగామా మర్చి పోకుండానే నిన్న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఏపీలో ఒక థియేటర్ లో జరిగిన అరాచకం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఏకంగా బిల్లా సినిమా ప్రదర్శించిన థియేటర్ లో క్రాకర్స్ ను వెలిగించి సీట్లను తగలబెట్టిన సంఘటన వైరల్ అయ్యింది.
సీట్లను కాల్చేయడంతో పాటు స్కీన్ ను కూడా నాశనం చేయడం జరిగింది. వెంటనే మంటలు ఆరప్పకుంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ప్రభాస్ అభిమానులు మరీ అభిమానం తలకెక్కి ఇలా పిచ్చి పిచ్చి గా ప్రవర్తిస్తున్నారు అంటూ తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆ హీరో అభిమానులే మరీ అరాచకం అంటే ఇప్పుడు ప్రభాస్ అభిమానులు మరింత అరాచకంగా తయారు అయ్యారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు.
థియేటర్ లో క్రాకర్స్ కాల్చడంను ఖండిస్తున్నాం అంటూ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరిగితే థియేటర్ల యాజమాన్యాలు కఠినంగా వ్యవహించాల్సి ఉంటుంది అంటూ ఈ సందర్భంగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.