రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం `సాహో` చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 300కోట్ల బడ్జెట్ తో యు.వి.క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దర్శకుడు సుజీత్ నెక్ట్స్ లెవల్లో చూపిస్తానన్న పంతంతో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. జిల్ రాధాకృష్ణ దర్శకత్వం వహించే తదుపరి చిత్రం ఆగస్టు తొలివారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అదంతా సరే.. ప్రభాస్ గురించిన ఓ ఆసక్తికర విషయం తెలిసింది. డార్లింగ్ ప్రభాస్ సాహో కోసం పూర్తిగా లుక్ ఛేంజ్ చేసేశాడు. ఇదివరకూ అమెరికా - లండన్ లాంటి చోట తన లుక్ గురించిన టెక్నాలజిస్టులతో రీసెర్చ్ కూడా చేయించుకున్నాడు. మార్పు చేర్పులు సూచించిన దానిని బట్టి అలా మారి చూపించాడు. సాహో ప్రీ లుక్ వచ్చినప్పుడే ఏదో అయ్యింది అన్న టాక్ కూడా వినిపించింది. అయితే ఇలా లుక్ ఛేంజ్ చేయడం కోసం అతడు ఎంత కేర్ తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ తినాల్సిందే.
ప్రభాస్ కోసం ప్రత్యేకించి ముంబై నుంచి స్పెషలిస్టు మేకప్ మేన్ బరిలో దిగుతున్నాడు. అతడికి రోజుకు ఏకంగా రూ.8000 భత్యం చెల్లిస్తున్నారు. విమానం టిక్కెట్లు - స్థానికంగా హోటల్ బిల్లులు వగైరా అదనపు ఖర్చు చేయాల్సిందేనట. ఇకపోతే అదే లోకల్ గయ్ కి అయితే రూ.5000 వరకూ భత్యం చెల్లిస్తారట. మన స్టార్ హీరోల్లో రామ్ చరణ్ - ఎన్టీఆర్ - అల్లు అర్జున్ వంటి స్టార్లు అవసరం మేర ముంబై నుంచి స్పెషలిస్ట్ మేకప్ మేన్ ని రప్పిస్తున్నారట. ఇప్పటికి ప్రభాస్ కి మాత్రం పోష్ హై రేంజు మేకప్ మేన్ లు పని చేస్తున్నారు. ప్రభాస్ కి టచప్ చేసే టచప్ బోయ్ కే కాల్షీట్ కి రూ.3000వేలు చెల్లిస్తారట. ఎన్టీఆర్ లోకల్ మేకప్ మేన్ నే ఉపయోగిస్తున్నారు. చరణ్ అప్పుడప్పుడు ముంబై మేకప్ మేన్ ని బరిలో దించుతుంటాడు. ఇవన్నీ ఓ సీనియర్ మేకప్ మేన్ ఇచ్చిన వివరాలు. ఇంట్రెస్టింగ్ కదూ?