జపాన్- చైనా- పాకిస్తాన్ ఎక్కడా లేడు ఇలాంటి అందగాడు! ఆసియాకే అందగాడిగా ప్రభాస్ రికార్డులకెక్కాడు ! సెలబ్రిటీ వరల్డ్ లో హ్యాండ్ సమ్ హీరో గా ప్రభాస్ క్రేజు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఛరిష్మాతో పాటు లుక్ వైజ్ టాప్ -1 లో నిలబడాలంటే ఎన్నో సాధించాల్సి ఉంటుంది. ఆసియా లెవల్ పోటీ అంటే ఎన్నో దేశాల హీరోలతో పోడీ పడాల్సి ఉంటుంది. ఇప్పటికే సాధించిన ఘనతకు అదనంగా సాధించాల్సినవి ఇంకెన్నో ఉంటాయి. ఇలా రకరకాల లెక్కలతో టాప్ -1 లో చోటు దక్కించుకున్నాడు ప్రభాస్. పాన్ ఇండియాస్ స్టార్ ప్రభాస్ కి అరుదైన అవకాశం దక్కింది. ఏషియన్ మోస్ట్ హ్యాండ్ సమ్ హీరోలలో ప్రభాస్ నెంబర్ -1 స్థానం దక్కించుకున్నారు. ఆసియా ఖండంలో అందరికన్నా అందగాడిగా నిలిచారు. ఏకంగా చైనా- జపాన్- పాకిస్తాన్- తైవాన్- వియత్నాం- దక్షిణ కొరియాకి చెందిన సెలబ్రిటీలందరినీ బీట్ చేసి యంగ్ రెబల్ స్టార్ అందగాడైన హీరోగా ఖ్యాతికెక్కారు.
టాప్ టెన్ మోస్ట్ హ్యండ్ సమ్ ఏషియన్స్ మెన్స్ రేసులో డార్లింగ్ ప్రభాస్ తొలిస్థానం సంపాదించి మరో అరుదైన ఘనత సాధించారు. ఇక ఇదే పోటీల్లో పాకిస్తాన్ నటుడు ఇమ్రాన్ అబ్బాస్ రెండవ స్థానంలో నిలిచారు. జపాన్ నటుడు జిన్ అకిన్షి మూడవ స్థానంలో, కిమ్ హ్యుయాన్ జూంగ్ సౌత్ కొరియా నాల్గవ స్థానంలో నహాన్ పిహూ విన్హూ వియత్నాం ఐదవ స్థానంలో.. హుయాంగ్ గ్జియోమోంగ్ చైనా ఆరో స్థానంలో,.. వివాన్ దేశాన్ ఇండియా ఏడవ స్థానంలో,.. ఫవద్ ఖాన్ పాకిస్తాన్ ఎనిమిదవ స్థానంలో,.. తానావట్ వట్టానపుట్టై థాయ్ లాండ్ తొమ్మిదవ స్థానంలో, ..వాలెస్ హుయో తైవాన్ పదవ స్థానంలో నిలిచారు.
మరి ప్రభాస్ కి ఇంతటి ఘన కీర్తి ఎలా లభించింది అంటే అది బాహుబలి తో దక్కిన పాపులారిటీ వల్లనే. `బాహుబలి` సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య విజయాన్ని సాధించింది. చైనా లో మినహా చాలా చోట్ల చక్కని వసూళ్లను తెచ్చింది. తైవాన్- జపాన్- ఉత్తర కొరియా- దక్షిణ కొరియా దేశాల్లో స్థానిక భాషల్లో సినిమా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. ఆ దేశాల నుంచి కూడా ప్రభాస్ కు అభిమానులు ఏర్పడ్డారు. ఆయన బర్త్ డే వేడుకల్ని విదేశీయులు ప్రభాస్ ఇంటి ముందు సెలబ్రేట్ చేసారంటే? అక్కడి ఆడియన్స్ కి డార్లింగ్ ఎంతగా రీచ్ అయ్యారన్నది తెలిసిందే. తాజాగా ఏషియన్ హ్యాండ్ సమ్ నటుల్లో నెంబర్-1 స్థానంతో మరోఉసారి వరల్డ్ వైడ్ గా వెలిగిపోతున్నారు.
మరో 4 పాన్ ఇండియా చిత్రాలు ఆసియా వైడ్ రిలీజ్?
ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాలన్నీ పాన్ ఇండియా కేటగిరీనే. ఇవన్నీ ఆసియా వైడ్ రిలీజవుతాయనే అభిమానులు అంచనా వేస్తున్నారు. రాధేశ్యామ్- సలార్- ఆదిపురుష్- నాగ్ అశ్విన్ తో మూవీ.. పాన్ వరల్డ్ రేంజులో రిలీజ్ కానున్నవే. ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రీకరణ పూర్తి చేసి.. తదుపరి సలార్ చిత్రీకరణకు హాజరవుతున్నారని తెలుస్తోంది. ఓవైపు ఆదిపురుష్ 3డి షెడ్యూల్ పూర్తి చేస్తూనే సలార్ కోసం అతడు డేట్లు ఇచ్చాడని తెలిసింది. సలార్ ఇంటర్వెల్ బ్యాంగ్ ని అదిరిపోయే రేంజులో తెరకెక్కిస్తారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో సైన్స్ ఫిక్షన్ మూవీ ని ప్రారంభించారని కథనాలొస్తున్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ గా ఎలివేట్ కానున్నాడని నాగ్ అశ్విన్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్ -దీపికా పదుకొనే లాంటి టాప్ స్టార్లు నటిస్తుండడం సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు `రాధే శ్యామ్` విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యువి బృందాలు రిలీజ్ తేదీని లాక్ చేశాయనే అంతా భావిస్తున్నారు. ప్రస్తుతానికి రాధేశ్యామ్ ని సల్మాన్ రాధే మోడల్ ఓటీటీ ప్లస్ థియేటర్స్ లో డైరెక్ట్ రిలీజ్ చేస్తారనే ఇంకా సందిగ్ధత వ్యక్తమవుతోంది.