'ఆదిపురుష్ ' లో ప్ర‌భాస్ అద్భుతాలు ఇవే?

Update: 2022-04-03 11:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ `ఆదిపురుష్` రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. `రామాయ‌ణం` ఆధారంగా తెర‌కెక్కుతోన్న చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. రామాయ‌ణంలో ప్ర‌తీ పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది. వాటికి `ఆదిపురుష్` రూపంలో ద‌ర్శ‌కుడు ఓంరౌత్ దృశ్య‌రూపాన్ని ఇచ్చి  ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డం అన్న‌ది నిజంగా ఎంతో సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం.

ఈ నేప‌థ్యంలో `ఆదిపురుష్` లో రాముడి పాత్ర‌లో డార్లింగ్ ఎలా క‌నిపిస్తాడు? అని ఒక‌టే ఉత్కంఠ అభిమానుల్లో నెల‌కొంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంచ‌నాల్ని అంత‌కంత‌కు పెంచేస్తున్నాయి. తాజాగా ఆ అంచ‌నాల్ని రెట్టింపు చేస్తూ రాముడి పాత్ర గురించి ద‌ర్శ‌కుడు ఓ రౌంత్ ఆస‌క్తిక‌ర విశేషాలు వెల్ల‌డించారు.

``క‌థ‌లో రాముడి వైభ‌వం..వైభ‌వాన్ని ఎంతో గొప్ప‌గా చూపించ‌బోతున్నాం. ప్రేక్ష‌కుల ఊహ‌కు అంద‌ని విధంగా స‌న్నివేశాలు హైలైట్ గా ఉంటాయి. రామాయ‌ణం ఎప్పుడు బ‌ల‌మైన ప్ర‌భావాన్ని క‌ల్గి ఉంటుంది. రాముడి పరాక్ర‌మ శైలిని సినిమాలో హైలైట్ చేస్తున్నాం. ఈ క‌థ నాపై ఎంత‌గానో ప్ర‌భావాన్ని చూపింది. `ఆది పురుష్` షూటింగ్ అనుభ‌వాన్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను.

ఎన్నో సినిమాల‌కు ప‌నిచేస్తాం. కానీ వాటిలో కొన్ని ఎప్ప‌టికీ మ‌ధుర‌స్మృతులే. అలాంటి చిత్రాల్లో `ఆదిపురుష్` కి నెంబ‌ర్ స్థానం ఇస్తాను. ప్ర‌భాస్..సైఫ్ అలీఖాన్ లాంటి ఇద్ద‌రి స్టార్ హీరోల‌తో ప‌నిచేయ‌డం గొప్ప అనుభూతినిచ్చింది. సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌భాస్ ని కేవ‌లం అత‌ని శ‌రీరంపై మాత్ర‌మే ప‌నిచేయ‌మ‌ని అడిగాను. ఎందుకంటే రాముడు మంచి విల్లు కారుడు. అందులో అత‌ని ప‌రాక్ర‌మ శైలి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

అర్చ‌ర్ లు శ‌రీరం విల్లులా ఎలా  వంగుతుందో...సినిమాలో హీరో క్యారెక్ట‌రైజేష‌న్ కూడా అలాగే ఉండాల‌ని అని ప్ర‌భాస్ తో చెప్పాను. అత‌ను ఎంతో ఎఫెర్ట్ పెట్టి సినిమాకి ప‌ని చేసారు. రాముడి పాత్ర‌లోకి ప్ర‌భాస్ సునాయాసంగా ట్రాన్స‌ప‌ర్ కాగ‌లిగారు. సినిమా కోసం ప్ర‌భాస్ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఇక అత‌ని లో బాగా న‌చ్చే క్వాలిటీ . అత‌ను డౌన్ టూ ఎర్త్ ప‌ర్స‌న్.

సెట్ లో అంద‌రూ స‌మాన భావ‌నే అన్న‌ది అత‌ని ఉద్దేశిం. అత‌నిలో ఆ ల‌క్ష‌ణం నాకు ఎంత‌గానో న‌చ్చింది. ప్ర‌భాస్ ఇంటిఫుడ్ సెట్ లో అంద‌రికీ రుచి చూపిస్తారు. చాలా స‌ర‌దాగా ఉంటారు. ఇక రావ‌ణుడి పాత్ర‌కు సైఫ్ అలీఖాన్ ఎంపిక విష‌యాన్ని రివీల్ చేసారు. `తాన్హాజీ` సినిమాలో సైఫ్ అల‌లీఖాన్ పాత్ర న‌న్ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఆ పాత్ర చూసే `ఆదిపురుష్` లో రావ‌ణుడి పాత్ర‌కు అత‌ను మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని భావించి  ఎంపిక చేసాం` అని ఓ రౌంత్ తెలిపారు.
Tags:    

Similar News