ఇప్పటివరకూ 2022 లో అసాధారణ విజయాలు సౌత్ నుంచి నమోదయ్యాయి. ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ 2- పుష్ప- మేజర్- కార్తికేయ 2 సౌత్ విలువను పెంచాయి. నార్త్ లో భూల్ భులయా 2 - కాశ్మీర్ ఫైల్స్ తర్వాత మళ్లీ అలాంటి విజయాలు కనిపించలేదు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా.. అక్షయ్ కుమార్ రక్షా బంధన్ తీవ్రంగా నిరాశపరిచాయి. మునుముందు రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర భారీ అంచనాల నడుమ విడుదలవుతోంది. ఇది దేవుళ్లు ఫిక్షన్ నేపథ్యంలో భారీ విజువల్ గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ మూవీపై కపూర్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఇది సౌత్ లో ఏమేరకు రాణిస్తుంది? అన్నది ఇప్పుడే చెప్పలేం.
ఇంతకుముందు టీజర్.. ట్రైలర్ కి సౌత్ నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. తెలుగులో విడుదలైన కొన్ని పాత సినిమాలను (శక్తి- అంజి- ఢమరుకం) సినిమాలను ఉదాహరణలుగా చూపిస్తూ క్రిటిసైజ్ చేయడం చూశాం. అందుకే బ్రహ్మాస్త్ర అద్భుతాలు చేయాలంటే కంటెంట్ పరంగా ఇన్ డెప్త్ ఎలిమెంట్స్ తో మిరాకిల్స్ చేసేందుకు దర్శకుడు ప్రయత్నించాల్సి ఉంటుంది.
అయితే సంక్రాంతి బరిలో వస్తున్న ఆదిపురుష్ 3డిపై ఇలాంటి నెగెటివ్ సెన్స్ ఇప్పటివరకూ లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాని రామాయణం స్ఫూర్తితో తెరకెక్కిస్తున్న ఓంరౌత్ అందులో పాత్రలను పురాణాల టచ్ తో అలాగే జనరేషన్ ఛేంజ్ తో.. అంటే నేటి ట్రెండ్ కి అనుగుణంగా సృజించడంతో కనెక్టివిటీ ఎలిమెంట్ పరంగా సమస్య లేకుండా జాగ్రత్త పడ్డారని విశ్లేషిస్తున్నారు. అలాగే ఈ మూవీ విజువల్ గ్రాఫిక్స్ బెంచ్ మార్క్ ని ఆవిష్కరిస్తాయన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. శ్రీరాముని శక్తి యుక్తులను గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూనే సీతాదేవి(కృతి సనోన్) కథను అద్భుతంగా తెరపైకి తెస్తున్నారని కూడా చెబుతున్నారు. అయితే ఈ కథను నేటి జనరేషన్ కి ఎలా కనెక్ట్ చేశారన్నదానిపై సరైన హింట్ ఇంకా రివీల్ కాలేదు. ఇక ఇందులో రావణుడిగా నటిస్తున్న సైఫ్ పాత్రను భీకర విలనీతో తెరపైకి తెస్తున్నారని సమాచారం. ప్రభాస్ - సైఫ్ (శ్రీరామ- రావణ) మధ్య పోరాట దృశ్యాలు మరో లెవల్లో ఆవిష్కరిస్తున్నారని అయితే ఈ మూవీకి సంబంధించి ఎలాంటి లీకులు లేకుండా ఓంరౌత్ జాగ్రత్త పడడం వల్లనే ఇప్పటివరకూ లీకులేవీ అందలేదని కూడా టాక్ వినిపిస్తోంది.
బాహుబలి ఫ్రాంఛైజీతో బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన ప్రభాస్ ఆ తర్వాత కూడా సాహో లాంటి యాక్షన్ సినిమాతో ఉత్తరాది బెల్ట్ లో ఘనవిజయం అందుకున్నాడు. అందువల్ల ఆదిపురుష్ 3డికి కూడా అలాంటి మరో అరుదైన అవకాశం లభిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ట్రేడ్ లోనూ ఆ మేరకు బజ్ ఉంది. తానాజీ చిత్రాన్ని 3డిలో ఓంరౌత్ ఆవిష్కరించిన తీరు ఆ సినిమా సాధించిన విజయం కూడా ఆదిపురుష్ 3డికి బజ్ పెంచేందుకు దోహదపడనుంది. ఇకపోతే ఈ మూవీ టీజర్.. ట్రైలర్ రాకతో మరింతగా హైప్ పెరిగేందుకు ఛాన్సుంటుంది. ఈనెలలోనే ఫస్ట్ లుక్ విడుదలవుతోంది. ఇక రికార్డుల పరంగా 1000 కోట్ల క్లబ్ ని ప్రభాస్ మరోసారి రిపీట్ చేస్తాడా లేదా? అన్నది వేచి చూడాలి. బ్రహ్మాస్త్ర ఈ నెలలో విడుదలవుతోంది. ఆ తర్వాత 2023 సంక్రాంతి బరిలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రమిది. అందువల్ల అంచనాలు తారా స్థాయికి చేరుతున్నాయి.