హాట్ సీట్ లో ప్రభాస్.. అన్ స్టాపబుల్ ఎనర్జీ..!

Update: 2022-12-11 02:53 GMT
బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 ముందు సీజన్ కన్నా మరింత వేగంగా దూసుకెళ్తుంది. ఎపిసోడ్ ఎపిసోడ్ కి షో మీద క్రేజ్ విపరీతంగా పెరుగుతుంది. అన్ స్టాపబుల్ సీజన్ 2 ఐదవ ఎపిసోడ్ ఇద్దరు బడా నిర్మాతలు.. ఇద్దరు టాలీవుడ్ బడా దర్శకులు రాగా నెక్స్ట్ ఎపిసోడ్ వేరే లెవల్ లో ఉండాలని ఏకంగా బాహుబలిని దించేస్తున్నారు. ఈమధ్యనే అన్ స్టాపబుల్ 2 ప్రోమో కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో సిటీలో కొన్నిచోట్ల హంగామా షురూ చేశారు. ఇక లేటెస్ట్ గా ప్రభాస్ బాలయ్యని ఫేస్ చేసే టైం వచ్చింది.

హోస్ట్ సీట్ లో బాలయ్య.. హాట్ సీట్ లో ప్రభాస్.. ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో చూసి ఆడియన్స్ సూపర్ ఎక్సైట్ అవుతారని చెప్పొచ్చు. అసలు ఈ కాంబో బీభత్సం అనిపించేలా ఉంటుందని చెప్పొచ్చు. ఆదివారం ఈ ఎపిసోడ్ షూట్ జరగనుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లన్ని చేసినట్టు తెలుస్తుంది. ప్రభాస్ తో బాలకృష్ణ ఎలా మాట్లాడారు.. ప్రభాస్ ని ఎలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. ప్రభాస్ నుంచి ఎలాంటి సమాధానాలు రాబట్టారు. ఇవన్ని తెలియాలంటే మాత్రం ప్రోమో రావాల్సిందే.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో బాలయ్య అన్ స్టాపబుల్ ఇంటర్వ్యూ చాలా ప్రత్యేకమైందని చెప్పొచ్చు. ప్రభాస్ మామూలుగానే చాలా తక్కువగా మాట్లాడతాడు. అది కూడా బాలయ్య లాంటి సీనియర్ హీరో ముందు అసలు నోరు విప్పుతాడా లేదా అని ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు. ఏది ఏమైనా ఫ్యాన్స్ మదిలో ఉన్న కొన్ని ప్రశ్నలను తన ద్వారా ప్రభాస్ చేత ఆన్సర్ చెప్పించాలని అనుకుంటున్నాడు బాలయ్య.

బాలకృష్ణ ఒక్కసారి ఫిక్స్ అయ్యారు అంటే ఇక మ్యాటర్ వేరేలా ఉంటుంది. కచ్చితంగా అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ఈ స్పెషల్ ఎపిసోడ్ స్పెషల్ రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ప్రభాస్ తో పాటుగా అతని ఫ్రెండ్ మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా ఈ ఎపిసోడ్ లో పాల్గొంటారని తెలుస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News