యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రాధేశ్యామ్' సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో.. తదుపరి చిత్రాలపై డార్లింగ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. వీలైనంత త్వరగా మరో చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చి ప్రభాస్ సత్తా ఏంటో బాక్సాఫీస్ కు మరోసారి చూపించాలని కోరుకుంటున్నారు.
అయితే ప్రభాస్ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోవడానికి స్పెయిన్ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. 'సాహో' షూటింగ్ సమయంలో డార్లింగ్ గాయపడ్డారట. డాక్టర్లు మోకాలికి సర్జరీ చేయించుకోవాలని సూచించగా.. సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండటం.. కోవిడ్ పాండమిక్ కారణంగా ప్రభాస్ దాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడట.
ఈ క్రమంలోనే ఇప్పుడు మోకాలి సర్జరీ కోసం ప్రభాస్ దేశం విడిచి వెళ్లాడని టాక్. అక్కడే బార్సిలోనాలో ఆయనకు శస్త్ర చికిత్స జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం, చికిత్స అనంతరం మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఇదే కనుక నిజమైతే ప్రభాస్ తదుపరి సినిమాలపై ఈ సర్జరీ ప్రభావం పడుతుంది.
ప్రభాస్ ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తోన్న 'ఆదిపురుష్' మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. ప్రశాంత్ నీల్ 'సలార్' మరియు నాగ్ అశ్విన్ 'ప్రాజెక్ట్ K' చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. అలానే సందీప్ వంగా తో 'స్పిరిట్' తో పాటుగా మారుతీ దర్శకత్వంలో ఓ సినిమాను పట్టాలెక్కించనున్నారు.
సర్జరీ తర్వాత ప్రభాస్ పూర్తిగా కోలుకునేందుకు రెండు మూడు నెలలు బెడ్ రెస్ట్ తీసుకుంటే.. షూటింగ్ షెడ్యూల్స్ వాయిదా వేయాల్సి వస్తుంది. 'సలార్' మూవీ షూటింగ్ ఇప్పటివరకు 60 శాతం మాత్రమే పూర్తయింది. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.
కానీ ఇప్పుడు ప్రభాస్ సెట్స్ లో అడుగుపెట్టడానికి సమయం పడుతుందని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే అలస్యమవుతూ వస్తోన్న 'ప్రాజెక్ట్ K' మూవీ.. ఈ అనుకోని గ్యాప్ కారణంగా మరింత ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదు.
ఇక మారుతి చిత్రాన్ని ఈ నెలాఖరున లేదా వచ్చే నెలలో స్టార్ట్ చేస్తారని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రభాస్ కు సర్జరీ జరిగింది నిజమే అయితే.. ఇప్పట్లో ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లకపోవచ్చు.
ఇదిలా ఉంటే ప్రభాస్ మోకాలి సర్జరీ గురించి ఇప్పటి వరకు సన్నిహిత వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేదు. కాకపోతే డార్లింగ్ కు శస్త్ర చికిత్స జరిగిందని వార్తలు వస్తుండటంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ హీరో త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.