ఆ విషయంలో మాత్రం జాగ్రత్తమ్మా ప్రభాసూ...

Update: 2015-08-11 23:29 GMT
బాహుబలి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లోనే కాకుండా యావత్ భారతదేశంలో యమ ఫాలోయింగ్ తెచ్చేసుకున్నాడు. ఏకంగా ప్రధాని అంతతోడే ప్రభాస్ తో స్వయంగా ఒక సినిమా గురించి మాట్లాడుతూ ఫోటోలు దిగుతూ కనిపించారంటే ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కలెక్షన్ల విషయంలో శిఖరాగ్రం చేరిన ఈ సినిమా ద్వారా నటుడిగా ప్రభాస్ కి పరభాషలలో సైతం మంచి గుర్తింపు వచ్చింది.

అయితే ఇదే తడువుగా 'బాహుబలి'తో ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో కొందరు నిమగ్నమైవున్నారు. ఇప్పటికే ప్రభాస్ మునుపటి హిట్ చిత్రం 'మిర్చి'ని మలయాళంలోకి అనువదించే పనిలో వున్నారు. అయితే ఇంతటితో ఆగితే ఒకే. కానీ ప్రభాస్ కెరీర్ లో ఫ్లాపులుగా నిలిచిన ఈశ్వర్, రాఘవేంద్ర వంటి సినిమాలను సైతం తమిళనాట అనువదించే పనికి కొందరు నిర్మాతలు పూనుకున్నట్టు సమాచారం.

 ఇదేగనుక జరిగితే బాహుబలితో సంపాదించుకున్న క్రేజ్ ఒక్కసారిగా కొట్టుకుపోతుందనడంలో సందేహం లేదు. ఇటువంటి ప్రయత్నాలు మనకు కొత్తేంకాదు. ధనుష్, కిచ్చా సుదీప్, విజయ్ ఫ్లాప్ సినిమాలు కూడా వారి సక్సెస్ టైం లో తెలుగులోకి అనువాదం జరిగి అపకీర్తిని ముటగట్టుకున్నాయి. మరి ప్రభాస్ వీటి బారిన పడకుండా జాగ్రత్తగా వుండాలి సుమీ..  
Tags:    

Similar News