యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 21 చిత్రంపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. సైన్స్ ఫిక్షన్ అంటూ మొదటి నుండి చెబుతున్న చిత్ర యూనిట్ సభ్యులు కథ ఏంటీ అనే విషయంలో మాత్రం చిన్న హింట్ కూడా ఇవ్వడం లేదు. దాంతో ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేస్తున్నారు.
సినీ వర్గాల్లో ప్రస్తుతం ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఏకంగా మూడవ ప్రపంచ యుద్దంను చూపించబోతున్నాడట. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పూ చూపించని విభిన్నమైన కథతో మూడవ ప్రపంచ యుద్ద నేపథ్యంను తీసుకుని నాగ్ అశ్విన్ ఈ సినిమాను రూపొందించేందుకు స్క్రిప్ట్ రెడీ చేశాడంటూ టాక్ వినిపిస్తుంది. ఈ పుకారు సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తుంది.
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ప్రతి సినిమా పాన్ ఇండియా మూవీ అవుతుంది. అయితే ఈ సినిమా మాత్రం ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ఇంగ్లీష్ లో కూడా డబ్ చేసి పాన్ వరల్డ్ మూవీగా విడుదల చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు. అందుకు గాను హాలీవుడ్ టెక్నీషియన్స్ ను ఈ సినిమా కోసం రంగంలోకి దించబోతున్నాడు. ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్తగా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకంను ప్రభాస్ ఫ్యాన్స్ కలిగి ఉన్నారు. మరి వారి నమ్మకంను నాగ్ అశ్విన్ ఏ మేరకు అందుకుంటాడు అనేది చూడాలి.