యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీ క్యాస్టింగ్ తో ఈ సినిమా తీయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ని తీసుకున్నారు. అలానే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ని కీలక పాత్రలో నటింపజేస్తున్నారు. లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ మెంటర్ గా వ్యవహరించనున్నారు. 'రాధే శ్యామ్' మూవీ పూర్తైన వెంటనే నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తాడని అందరూ భావించారు. అయితే అదే సమయంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే మరో సినిమా ప్రకటించాడు ప్రభాస్. ఈ చిత్రాన్ని 2022 ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
కాగా, ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాని 'రాధే శ్యామ్' షూటింగ్ పూర్తైన వెంటనే స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. దీంతో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లినా 2023 లోపు ప్రేక్షకుల ముందుకు వచ్చేది కష్టమే అని అనుమానం కలుగుతోంది. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రానున్న ఈ చిత్రాన్ని భారీ స్కేల్ లో రూపొందించాల్సి ఉంటుంది. టాకీ పార్ట్ పూర్తి చేయడానికి ఒక ఏడాది సమయం పట్టినా మిగతా వర్క్ కంప్లీట్ చేయడానికి చాలా సమయమే పట్టనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే లోపు ప్రభాస్ ఎలా అవుతాడో.. దీపికా పదుకునే ఎలా ఉంటుందో ఏంటో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమా బడ్జెట్ 450 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ కానున్న ఈ చిత్రంలో ఫాక్స్ స్టార్ వారు కూడా పెట్టుబడి పెడుతున్నారట. ఏదేమైనా ప్రభాస్ - నాగ్ అశ్విన్ సినిమా ఇప్పట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమే లేదని టాక్ మాత్రం వినిపిస్తోంది.