డార్లింగ్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ సినిమా `సాహో`లో ఎక్స్ క్లూజివ్ గా చెప్పుకోవడానికి ఏం ఉంటుంది? భారీయాక్షన్ సినిమాలు చూడడం తెలుగు జనాలకు కొత్తేమీ కాదు. నేరుగా హాలీవుడ్ సినిమాల రుచి మరిగారు అంతా. ఇటీవల తెలుగు సినిమాల కంటే హాలీవుడ్ సినిమాలకే ఆదరణ అంతకంతకు పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి టైమ్ లో సాహో ఎక్స్ క్లూజివిటీ ఏంటి? అంటే డార్లింగ్ ప్రభాస్ చెప్పిన దానిని బట్టి ఓ రెండు ఇంపార్టెంట్ విషయాలు కనిపిస్తున్నాయి.
ఒకటి ఈ సినిమా స్క్రీన్ ప్లే హైలైట్ గా ఉంటుంది. ఇంతకుముందు తెలుగు సినిమాల్లో చూడని స్క్రీన్ ప్లే చూపించబోతున్నారు. భారీ యాక్షన్ తో పాటుగా కథనంలో ఎంతో గమ్మత్తయిన ట్విస్టులు ఉంటాయి. ఇక ఈ సినిమాలో `లాల్ బంగ్లా సీన్` సినిమాకే హైలైట్. అలాగే ఒకే సీన్ ఐదారు సార్లు వస్తుంది. అన్నిసార్లు ఒకే సీన్ రిపీట్ అవ్వడం దాంట్లోనే కథ ఇన్వాల్వ్ అయ్యి ఉండడం ఉత్కంఠ పెంచుతుందట. ఈ విషయాన్ని డార్లింగ్ ప్రభాస్ ప్రత్యేకంగా హైలైట్ చేసి చెబుతుండడం ఆసక్తిని పెంచుతోంది.
సుజీత్ కొత్త కుర్రాడు. అతడిపై నమ్మకం మీకు ఎప్పుడు కుదిరింది? అని ప్రశ్నిస్తే ప్రభాస్ సమాధానం ఇదీ. అందులోనే ఆ సీన్ ని లీక్ చేశారు. ప్రభాస్ మాట్లాడుతూ .. ``ఇందులో లాల్ బంగ్లా సీన్ ఒకే సీన్ ఐదారు సార్లు వస్తుంది. అది చాలా కాంప్లికేటెడ్.. నటుడి పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎంత కష్టమైనదో నాకు తెలుసు. దాంట్లో రీషూట్ లేదు. కరెక్షన్ లేదు. అయినా బాగా తీశాడు. సాహో కథలో ఎనిమిది లేయర్స్ ఉంటాయి. నటుడి పాయింట్ ఆఫ్ వ్యూలో.. స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని లేయర్స్ కనిపిస్తాయి. సుజీత్ ఎలాంటి టెన్షన్ లేకుండా ఒత్తిడి లేకుండా సినిమా తీశాడు`` అని తెలిపారు. మొత్తానికి అబూదబీ భారీ ఫ్లైవోవర్ సీన్ ఒక్కటే కాదు సినిమాలో చెప్పుకోవడానికి ఇంకా ఇంకా చాలా మ్యాటర్స్ ఉంటాయని అర్థమవుతోంది. అయితే ఒకే సీన్ ఐదారు సార్లు రిపీటవ్వడం అంటే ఈ తరహా స్క్రీ న్ ప్లేలు హాలీవుడ్ లో ఇంతకుముందు చాలా సినిమాల్లో వచ్చాయి. అందులో `సోర్స్ కోడ్` అనే చిత్రం ఇప్పటికీ అల్టిమేట్ అనే చెప్పాలి.